Posts

Showing posts from March, 2026
Image
 రంగుల పండుగ — హోళి  రంగుల పండుగ హోళి — హృదయాలపై వెలుగులు చల్లి, వర్ణాల వర్షంలో తడిసి చలికే చెప్పే వీడ్కోలు. ఎరుపు ప్రేమకు ప్రతీక, పసుపు పుణ్యపు చిరునవ్వు, ఆకుపచ్చ ఆశల పిలుపు, నీలి నమ్మకపు కలువవ్వు. చేతిలో గులాల్ పట్టుకుని మనసులు కలిపే వేళ, నిన్నటి నొప్పులు కడిగేసి నవ్వులు చిందించే వేళ. బంధాల మధ్య గోడలు కూల్చి స్నేహం రంగులై పరచి, కలహాలపై క్షమ కురిపించి కరుణ కాంతులు మెరిపించు. హోళి అంటే హంగామా కాదు, హోళి అంటే హృదయోత్సవం, మనుషుల మధ్య ప్రేమ చల్లే సజీవ సౌహార్ద పర్వం. రంగులు మన ముఖాలకే కాదు — మనసులకూ అంటుకోవాలి, ప్రతి రోజూ హోళిలా మారి ప్రపంచం ప్రేమమయం కావాలి.  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.