Posts

Showing posts from March, 2025
Image
 చుక్కలతో చెబుతా చుక్కలతో  చెబుతా  చెంతకు రమ్మని  చక్కదనాలు చూపమని తారకలతో అంటా మా ఇంటికొచ్చి గోడలపై నివసించమని నక్షత్రాలతో చెపుతా మాగడప ముందుకొచ్చి ముగ్గుల్లో కూర్చోమని భాసంతులతో వేడుకుంటా మా ఆడువారినుదుటకెక్కి వెలుగులు చిమ్మమని ఉడువులతో అభ్యర్ధిస్తా రవ్వలు చిందమని కళ్ళకు ఆనందమివ్వమని భములతో కోర్కెతెలుపుతా చంద్రుడులేనప్పటికి వజ్రాల్లా వెలుగమని రిక్కలతో చెప్పుతా నా మదిలోదూరి తళుకులు చిందమని తారలతో విన్నవించుకుంటా నా అక్షరాలనధిరోహించి కవితలను వెలిగించమని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ కవీ! ఓసారి ఆలోచించు ఎవరు చూచేరు నీ కవితలను అందులోని అందాలను ఎవరు  చదివేరు నీ కవితలను పొందేరు ఆనందాలను ఎవరు క్రోలేరు నీ కవితలను అవి అందించే మాధుర్యాలను ఎవరు వినేరు నీ కవితలను శ్రోతయై శ్రావ్యతను  ఆస్వాదించేరు ఎవరు తలచేరు నీ కవితలను అందుకు  నీవుపడ్డ శ్రమను ఎవరు మెచ్చేరు నీ కవితలను రచనాశైలిని పదప్రయోగాలను ఎవరు కోరేరు నీ కవితలను పంపమని ప్రతిరోజు  ఎవరు ప్రచురించేరు నీ కవితలను చేర్చేరు పాఠకలోకమునకు ఓ కవీ రాచేముందు ఒకసారి ఆలోచించు ఓ కవీ పంపేముందు గుర్తించుకో సాహితీప్రియుల అభిలాషలను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 మన ఉగాదిముచ్చట్లు ఉగాది ఆగమనం తెలుగోళ్ళకు సంతోషం తెలుగువారి తొలిపండుగ తెలుగుజాతి పెద్దవేడుక చైత్రమాసం ఆరంభం వసంతకాలం ప్రారంభం ఋతువు  మార్పు కొత్తవత్సరం మొదలు మల్లెల గుబాళీంపులు, కోకిలల కుహూకుహూలు పంచాంగ శ్రవణాలు, షడ్రుచుల ఆరగింపులు కవితల సమ్మేళనాలు, కవులకు సన్మానాలు శుభాకాంక్షలు చెప్పటాలు, కలసి యుగాదిసంబరాలు కొత్తబట్టల ధరించటం గడపలకు తోరణాలుకట్టటం కొత్తకోడళ్ళు కోడరికానికిరావటం సలిబిండిపందేరాలు ఉగాదిసంప్రదాయం గుళ్ళల్లో పూజలు దేవుళ్ళ ఊరేగింపులు భాజాభజంత్రీలు భజనలు కోలాటకోలాహలాలు మధుమాసమాధుర్యాలు విశ్వావసు ఉగాదికి ఆహ్వానం పలుకుదాం నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుకుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   🌷🌷🌷💐💐💐అందరికీ ఉగాది శుభాకాంక్షలు💐💐💐🌷🌷🌷 
 నా మాటలవర్షంలో తడుస్తారా కవితలకాలువలో పయనిస్తారా! మీరు నా మాటల్ని  వింటారనుకుంటున్నాను సందర్భం ఎరిగి సమయం తెలుసుకొని ఆస్వాదిస్తారనుకుంటున్నాను నా మాటల్ని విశ్వసిస్తారనుకుంటున్నాను కట్టుకధలు కావని కనికట్టులు కాదని అభిప్రాయపడతారనుకుంటున్నాను నా మాటల్ని చదువుతారనుకుంటున్నాను చక్కగా అమరాయని తియ్యగా ఉన్నాయని తలంచుతారనుకుంటున్నాను నా మాటల్ని గురుతుపెట్టుకుంటారనుకుంటున్నాను నోటిలో నానుస్తూ తలలో దాచుకుంటూ మెలుగుతారనుకుంటున్నాను నా మాటల్ని పట్టించుకుంటారనుకుంటున్నాను అంతరార్ధాలు ఎరిగి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తారనుకుంటున్నాను నా మాటల్ని ప్రాచుర్యంలోకి తెస్తారనుకుంటున్నాను సామెతల్లా వాడి సందేశాల్లా భావించి ప్రశంసిస్తారనుకుంటున్నాను నా మాటలశక్తితో మిమ్మల్ని కట్టిపడవేయాలనుకుంటున్నాను నా మాటలకౌశలంతో మిమ్మల్ని మురిపించాలనుకుంటున్నాను నా అక్షరాలకూర్పుతో మిమ్మల్ని అలరించాలనుకుంటున్నాను నా పదాలప్రయోగంతో మిమ్మల్ని పారవశ్యపరచాలనుకుంటున్నాను నా మాటలతో అంగీకరిస్తారా నా రాతలతో ఆనందిస్తారా నా మాటలవర్షంలో తడుస్తారా నా కవితలకాలువలో పయనిస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 నువ్వెవరివంటే? నువ్వు ఎవరివంటే నిమిషమాగకుండా ఇలా జవాబిస్తా నీపని ఏమిటంటే నీళ్ళునమలకుండా ఇట్లా సమాధానమిస్తా నేను వయసు పెరిగినా సొగసు తగ్గనివాడిని జుట్టు తెల్లబడినా పట్టు సడలనివాడిని పళ్ళు రాలినా ప్రేమ ఒలికేవాడిని చూపు మందగించినా అందాలు ఆస్వాదించేవాడిని కాళ్ళు తడబడుతున్నా నడకను సాగించేవాడిని దప్పిక కాకపోయినా అమృతము క్రోలేవాడిని ఆకలి లేకపోయినా అందినవన్నీ ఆరగించేవాడిని అందం అందితే అందరికీ అందించేవాడిని అక్షరాలు అల్లేవాడిని పదాలు పేర్చేవాడిని కవితలు కూర్చేవాడిని మనసులు దోచేవాడిని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 కవిసమ్మేళనాల సంబడము  అదేదో అరుదైన కవిసమ్మేళనమట అక్కడెక్కడికో అరగంటముందే వేదికకుచేరుకోవాలట కవిత ఇరవైపంక్తులు మించకూడదట సమయము రెండునిమిషాలు దాటకూడదట అంశమేమో ఐచ్ఛికమట ఉపోద్ఘాతాలేవీ చెప్పకూడదట చెప్పినవి వినాలట చప్పట్లు కొట్టాలట పెట్టింది తినాలట ప్రశ్నలేవి అడగకూడదట  కదలకుండా కూర్చోవాలట నోరువిప్పకుండా మూసుకోవాలట అతిధులను గౌరవించాలట సుత్తిచెప్పినా స్తుతించాలట నిర్వాహకులను మెచ్చుకోవాలట విమర్శలను సంధించకూడదట బాగున్నా లేకున్నా భరించాలట ఇది మరీబాగుంది  భండారం బయటపెట్టకూడదట సమ్మేళనాలకు పోకుండుంటే పోలా సన్మానాలపిచ్చి వదులుకుంటే సరిపోదా ఇంట్లోకూర్చొని కవితలురాసుకుంటే చాలదా సాంఘీకమాధ్యమాలకుపంపి సరిపుచ్చుకోవచ్చుకదా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 అందాల ఆకాశమా! నిందిస్తే ఉరమకు మెరవకు భయపెట్టకు నల్లదానాయంటే నిరాశచెందకు కుంభవృష్టి కురిపించకు ఉపద్రవాలు సృష్టించకు బాగున్నావంటే హరివిల్లును చూపకు వానజల్లులు ఆపకు కరువుకాటకాలు కలిగించకు ద్వేషిస్తే కుప్పకూలకు ప్రళయాగ్నిరగల్చకు పుడమినిబూడిదచేయకు తిడితే కోపగించకు నక్షత్రాలు చల్లకు వడగళ్ళు విసరకు చెంతకొస్తే చేరదీయి సుఖాలనివ్వు సంతోషపెట్టు ఔట్లుకాలిస్తే అదరకు బెదరకు ఉలిక్కిపడకు గాలిపటమెగరేస్తే తోకనుతెంచకు దారాన్నికత్తిరించకు నేలపైకికూల్చకు ఆకాశమా భ్రమకొలపకు మిధ్యననకు మోసముచేయకు ఆకాశమా భూమిని ఢీకొట్టకు కడలిని పొంగించకు గాలిని నిలిపేయకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 ఘనంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక అంతర్జాల సమావేశం  నిన్న 24-03-25 వ తేదీ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 7 వ సమావేశం  అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధి మరియు ప్రముఖ సాహితీవేత్త  దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ తెలుగు వారికి అత్యంత ప్రీతిప్రదమైన ఉగాది సందర్భాన సమావేశం మరియు కవిసమ్మేళనం నిర్వహించటం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. దాస్యం సేనాధిపతి గారు ప్రవచనాల్లాంటి పలకరింపులతో అందరిని అలరించారు. సభాధ్యక్షులు మరియు సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్  ప్రసంగిస్తూ మల్కాజగిరి కవుల వేదిక స్థాపించిన 6 నెలల్లోనే ఏడు సమావేశాలు చక్కగా నిర్వహించి అందరి మన్ననలను పొంది కవులకు మంచి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. మొదట  నంది పురస్కార గ్రహిత డాక్టర్ దీపక్ న్యాతి గారు అతిధులకు కవులకు స్వాగతం పలికారు.విశ్రాంత అటవీశాఖ అధికారి  అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు అనర్గళంగా నాటకీయ సంభాషణల్లా చక్కగా ప్రసంగించి అందరి మదులను తట్టారు. విశ్రాంత బ్యాంకు అధికారి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సహనిర్వాహకులను, అతిధులను, కవి మిత్రులను తమ అత్మీయ పలుకులతో స్వాగతించి,ముందస్తు ఉగాది శుభాకాంక్...
Image
 కవితమ్మ కవ్వింపులు ఆమె వెన్నుతడుతుంది వేకువనే నిద్రలేపుతుంది ఆమె ఆలోచనలులేపుతుంది అక్షరాలను అందంగా అల్లమంటుంది ఆమె విషయాలను ఇస్తుంది విన్నూతనంగా వ్యక్తపరచమంటుంది ఆమె కలము చేతికిస్తుంది కాగితాలను నింపమని కోరుతుంది ఆమె సూర్యోదయము కనమంటుంది ముందుగానే కవితోదయము చేయమంటుంది ఆమె భుజము తడుతుంది సంతసంతో అభినందనలు తెలుపుతుంది ఆమె పొగడ్తలుగుప్పిస్తుంది ఏలనో ప్రోత్సాహపరుస్తుంది ఆమె పాఠకులను నిత్యమూచదివిస్తుంది ఎందుకో చక్కగా స్పందింపజేయిస్తుంది అదే కవితాకన్యక ప్రేమాభిమానము ఇదే కవ్వింపులకు ప్రతిస్పందనము అదే సాహితీ సమ్మోహనము ఇదే కవితలకి జన్మకారణము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 రెక్కల ఊపులు ఊసులు లెక్కలు రెక్కలు ఉటంకించాలని ఉన్నది ఊహలలోకంలోనికి తీసుకెళ్ళాలని ఉన్నది ఉల్లాలను ఉత్సాహపరచాలని ఉన్నది రెక్కలు వర్ణించాలని ఉన్నది గరుడిని గుర్తుకుతేవాలని ఉన్నది విష్ణుని తలపించచేయాలని ఉన్నది రెక్కలు తొడుక్కోవాలని ఉన్నది పక్షులదగ్గరకు పోవాలని ఉన్నది స్నేహము చేయాలని ఉన్నది  రెక్కలు టపటపలాడించాలని ఉన్నది హృదులు తట్టాలని ఉన్నది మదులు ముచ్చటపరచాలని ఉన్నది రెక్కలు ధరించాలని ఉన్నది ఆకాశపుటంచుల్ని తాకాలని ఉన్నది మబ్బులపైనెక్కి తిరగాలని ఉన్నది రెక్కలు విప్పాలని ఉన్నది రివ్వున ఎగరాలని ఉన్నది పర్వతశిఖరాలు చేరాలని ఉన్నది రెక్కలు ఆడించాలని ఉన్నది డొక్కలు నింపుకోవాలని ఉన్నది వందేళ్ళు బతకాలని ఉన్నది రెక్కలు ముక్కలు చేసుకోవాలని ఉన్నది డబ్బులు సంపాదించాలని ఉన్నది కోర్కెలు తీర్చుకోవాలని ఉన్నది రెక్కలు  కప్పాలని ఉన్నది వేడినుండి కాపాడాలని ఉన్నది చలినుండి రక్షించాలని ఉన్నది రెక్కలు కట్టుకోవాలని ఉన్నది చెలిదగ్గర వాలాలని ఉన్నది సంబరపరచాలని ఉన్నది రెక్కలు తెంచుకోవాలని ఉన్నది నేలపై కూలాలని ఉన్నది మనుషులతో కలిసుండాలని ఉన్నది రెక్కలు ఊపాలని ఉన్నది గాలిని విసరాలని ఉన్నది చెమటలు తుడ...
 నా కవనపథం నాదారిలో నడుస్తున్నా ఆగకుండా ముందుకెళుతున్నా నాబాటలో పయనిస్తున్నా అనుభూతులను వ్యక్తపరుస్తున్నా నామార్గంలో అడుగులేస్తున్నా తెల్లారితేజస్సులను వెన్నెలవెలుగులనువెదజల్లుతున్నా నాపథంలో సంచరిస్తున్నా ఆలోచనలుపారిస్తున్నా అక్షరరూపమిస్తున్నా నాతెరువులో అన్వేషిస్తున్నా తీరైనభావాలను సరైనరీతిలోకలబోస్తున్నా నానరవలో విహరిస్తున్నా పసందైనపదాలతో పలుకరించుతున్నా నాత్రోవలో వెదుకుతున్నా జ్యోతులువెలిగించి జగతినిచైతన్యపరుస్తున్నా నాజాడలో శ్రమిస్తున్నా అందమైన అభరణాలనుచేసి అమ్మవాణీదేవిమేదలో వేయాలనిచూస్తున్నా నాదోవలో పనిజేస్తున్నా ముళ్ళనుతీసేసి పూలనుచల్లుతున్నా నాదారిలో నూతనత్వంచాటాలనుకుంటున్నా అంతరంగాలను ఆకట్టుకోవాలనుకుంటున్నా నాసరణిని వదలకూడదనుకుంటున్నా నాపనిని వీడకూడదనుకుంటున్నా నాసడవని అంటుకొని ఉంటా నాదృష్టిని అంతంవరకు సాగిస్తుంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఎవరైనా....వద్దనకు ఎవరైనా నీ హృదయాన్ని కరిగిస్తామంటే కాదనకు ఎవరైనా నీ గుండెను రగిలిస్తామంటే వద్దనకు ఎవరైనా నీ తలను తొలుస్తామంటే అభ్యంతరంచెప్పకు ఎవరైనా నీ మనసును మదిస్తామంటే నివారించకు ఎవరైనా నీ నోటిలో మాటలుపెడతామంటే వ్యతిరేకించకు ఎవరైనా నీ కళ్ళకు అందాలుచూపుతామంటే అడ్డుచెప్పకు ఎవరైనా నీ చెవుల్లో ఊదుతామంటే అక్షేపించకు ఎవరైనా నీ ఉల్లానికి ఉత్సాహమిస్తామంటే ఆటంకపరచకు ఎవరైనా  నీ తెలివికి  పరీక్షపెడతామంటే  ప్రతిఘటించకు ఎవరైనా నీ మీద విజయంసాధిస్తామంటే కోపగించకు దేనిలో ఏముందో? ఏపుట్టలో ఏపాముందో? ఎవరిలో ఏశక్తి ఉన్నదో? ఎవ్వరిలో ఏయుక్తి ఉన్నదో? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఉలిక్కిపడకు.... ఉలిక్కిపడకు  చెబుతున్నా ఉన్నమాటలు  త్రుళ్ళిపడకు తంటాలు తెచ్చుకోకు మిడిసిపడకు ముందుంది ముసళ్ళపండుగ ఎగిసిపడకు తాడినితన్నితే తలనుతన్నేవాడుంటాడు తత్తరపడకు  గత్తరతెచ్చుకోకు  బిత్తరచూపకు చిత్తయిపోకు ఆవేశపడకు అనర్ధాలు తెచ్చుకోకు  కృంగిపోకు  కుతకుతలాడకు  గంతులేయకు  గమ్మత్తులుచేయకు  చిందులేయకు  చిటపటలాడకు  భంగపడకు  జాగ్రత్తగా ప్రవర్తించు  భయపడకు  ధైర్యంగా ముందుకెళ్ళు  అతిగా ఊహించుకోకు  ఆర్హతనెరిగి అడుగిడు  అందరినీ నమ్మకు  బుట్టలో చిక్కకు  పరుగులు తీయకు  క్రింద పడకు    అబద్ధాలు చెప్పకు  అభాసుపాలు కాకు  కోతలు కొయ్యకు నవ్వులపాలు కాకు గుంటలు తియ్యకు  గోతుల్లో పడకు  అశ్రద్ధ వహించకు  కష్టాలు కొనితెచ్చుకోకు  అన్నిట్లో జోక్యంచేసుకోకు   అపనిందలు మూటకట్టుకోకు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 మనతెలుగు మనవెలుగు - మనపలుకు మనకులుకు అమ్మభాష ఆంధ్రము  చిమ్ముతుంది  ప్రకాశము  అమ్మభాష మధురము  చిందుతుంది మరందము  అమ్మభాష అమృతము నిలుస్తుంది కలకాలము అమ్మభాష సుమము   చల్లుతుంది సౌరభము  అమ్మభాష అందలము  ఆరోహణము  అవశ్యము  అమ్మభాష మార్గదర్శకము  కనబరుస్తుంది మంచిపధము  అమ్మభాష పండినఫలము  పదాలు పనసతొనలు అమ్మభాష పఠనీయము  ఇస్తుంది విజ్ఞానము అమ్మభాష ప్రియము  పెంచుతుంది బాంధవ్యము  అమ్మభాష సాధనము  చేకూరుస్తుంది సౌభాగ్యము  అమ్మభాష భండారము  వజ్రవైఢూర్యాలకు  నిలయము   అమ్మభాష అమరము  అమృతముతో సమానము అమ్మభాష అమూల్యము  గౌరవానికి ప్రతీకము అమ్మభాష అజంతము  పలుకుబడులకు  ప్రాణము  అమ్మభాష సుజలము  చక్కెర పానీయము  అమ్మభాష సౌమ్యము  పదలాలిత్యానికి  ప్రఖ్యాతము అమ్మభాష పలుప్రక్రియలకుస్థానము   అవధానాలకు ఆలవాలము అమ్మభాష ఆదర్శము  అందరికీ  అనుసరణీయము  అమ్మభాషకు  అంకితమవుదాం  అమ్మను  ఆరాధించుదాము  అమ్మకుజేజేలు పలుకుదా...
Image
 ఓ వెన్నెలా! ఎవరికోసం వచ్చావే వెన్నెలా ఎందుకోసం వెదుకుతున్నావే వెన్నెలా ఎంత అందం ఒలకబోస్తున్నావే వెన్నెలా ఎంత ఆనందం అందిస్తున్నావే వెన్నెలా ఏపడతుల నవ్వులు చిందుతున్నావే వెన్నెలా ఏపువ్వుల సౌరభాలు చల్లుతున్నావే వెన్నెలా ఎవరి వెలుగులు ప్రసరిస్తున్నావే వెన్నెలా ఎవరి చల్లదనం వెదజల్లుతున్నావే వెన్నెలా ఎవరిని పిలుస్తున్నావే వెన్నెలా ఎవరికి వలవేస్తున్నావే వెన్నెలా ఎవరికోసం చూస్తున్నావే వెన్నెలా ఏమి అందించాలనుకుంటున్నావే వెన్నెలా ఎందరి ఎదలను దోస్తున్నావే వెన్నెలా ఎన్నెన్ని కోర్కెలు రేపుతున్నావే వెన్నెలా ఎన్ని హృదులను తడుతున్నావే వెన్నెలా ఎన్ని మదులను మురిపిస్తున్నావే వెన్నెలా ఎంతసేపు ఊరిస్తావే వెన్నెలా ఎంతసమయం విహరించమంటావే వెన్నెలా ఎందుకో నీతలపులు వీడలేకున్నానే వెన్నెలా ఏమిటో నీరూపము మరువలేకున్నానే వెన్నెలా నాదరికి రావే  వెన్నెలా నాకుదారిని చూపవే వెన్నెలా నాలక్ష్యాలు చేర్చవే వెన్నలా నాకాంక్ష్యలు తీర్చవే వెన్నెలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం 
 మాటల ముచ్చట్లు కొందరి మాటలు చినుకులై రాలుతాయి అమృతమై పారుతాయి తేనెచుక్కలై చిందుతాయి కొందరి మాటలు పువ్వుల్లా పూస్తాయి పొంకాలు చూపుతాయి పరిమళాలు చల్లుతాయి కొందరి మాటలు ఇంపుగా ఉంటాయి సొంపుగా వినిపిస్తాయి కమ్మగా తోస్తాయి కొందరి మాటలు సామెతలవుతాయి హితములవుతాయి ఉదాహరణలవుతాయి కొందరి మాటలు ఆటపట్టిస్తాయి పాటపాడిస్తాయి నాట్యంచేయిస్తాయి కొందరి మాటలు తూటాలు ప్రేలుస్తాయి మంటలు పుట్టిస్తాయి ద్వేషాన్ని రగిలిస్తాయి కొందరి మాటలు వ్యర్ధమనిపిస్తాయి అర్ధంలేదనిపిస్తాయి స్వార్ధాన్నితెలుపుతాయి కొందరి మాటలు తక్కువగుంటాయి ఎక్కువభావాన్నితెలుపుతాయి నోర్లలోనానుతాయి కొందరి మాటలు తియ్యగుంటాయి తెలివిగుంటాయి తలల్లోనిలుస్తాయి కొందరి మాటలు గుర్తుపెట్టుకుంటాము ప్రయోగిస్తుంటాము ప్రచారంచేస్తుంటాము కాటావేసి మాటలు సమయానుకూలంగా వాడాలి సంశయానికి తావులేకుండా చూడాలి సూటిగా శ్లేషలేకుండా ప్రయోగించాలి మాటలు మంచివైతే నోరుకు విలువస్తుంది ఊరు బాగుంటుంది పేరు వస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Image
 కవితావర్షం  గుండెలోన  కురిసింది అక్షరవర్షము  హృదిని తడిపింది పదాలజల్లు తలలోన ప్రవహించాయి ఊహలు మనసులోన  ఏర్పడింది భావము ఉల్లం ఉప్పొంగి పుట్టింది విషయము చిత్తం స్పందించి ఇచ్చింది చైతన్యము కాగితంపై అక్షరాలుచల్లింది కలము పదాలై పుట్టకొచ్చింది కవిత అందమై ఆకట్టుకుంది కవనము ఆనందమై అలరించింది కవిత్వము కమ్మదనమై ఉదయిస్తుంది కవిత తీయదనమై తేనెచల్లుతున్నాడు కవి  నిత్యమై కురుస్తుంది కవితావర్షము సత్యమై  నిలుస్తుంది సాహితీలోకము  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రసవత్తరంగా జరిగిన వీక్షణం 151వ అంతర్జాల సమావేశం  నేడు 15-03-25వ తేదీ ఉదయం జరిగిన వీక్షణం 151వ అంతర్జాల సమావేశం రసవత్తరంగా జరిగినది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి తల్లాప్రగడ రావు, మధు ప్రఖ్యా మరియు కవులకు స్వాగతం పలికారు. 150 సమావేశాల సమీక్షలను పుస్తకంగా తీసుకొని రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి సమావేశం 2012న జరిగిందని 150 వ సమావేశం గతనెల 22వ తేదీ జరిగిందన్నారు. 150 సమావేశాల సంచికను డాక్టర్ తల్లాప్రగడ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం సంతోషంగా ఉన్నదన్నారు. మృత్యుంజయుడు మాట్లాడుతూ మొదటి సమావేశం నుండి వీక్షణం సమూహంతో కలసి పనిజేయటం సంతోషంగా ఉన్నదన్నారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ప్రసంగిస్తూ వీక్షణం సమవేశాలు చాలా బాగా జరుగుతున్నాయని, భారతీయ కవులు ఈ సమావేశాలలో పాల్గొనటానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. పిమ్మట ప్రఖ్యాత కవి మధు ప్రఖ్యా కవిసమ్మేళనం నిర్వహించారు. రావు తల్లాప్రగడ వినాయకుని కీర్తనతో కవిసమ్మేళనం ప్రారంభీంచారు. డాక్టర్ గీతా మాధవి ఆమె ప్రియురాలు కవితను, భిల్లా శ్రీధరరెడ్డి పచ్చరాళ్ళు కవితను, ముప్పాళ్ళ భవాని నా ఊహలో వసంతం కవితను, మౌనశ్రీ మల్లిక...
Image
 జీవన పయనంలో... జీవితంలో ఎన్నో ఏళ్ళు గడిపావు ఎన్నో పాఠాలు నేర్చావు గతమును నెమరేసుకో అనుభవాలను తలచుకో లోతుపాతులు తెలుసుకో లోటుపాట్లు సరిదిద్దుకో మంచీచెడులు ఆలోచించుకో విచక్షణను ఉపయోగించుకో పూలమార్గాన నడుచుకో ముళ్ళదారినడక మానుకో లక్ష్యాలను చేరుకో జీవితమును సాఫల్యంచేసుకో ప్రేమాభిమానాలు పంచుకో ఉద్రేకవిద్వేషాలు తెంచుకో విజయాలను అందుకో వైఫల్యాలను మరచిపో పొగడ్తలకు పొంగకు తెగడ్తలకు కృంగకు పరహితాలకు పూనుకో స్వార్ధమును తగ్గించుకో గొప్పలు చెప్పుకోకు చెత్తను దాచుకోకు ఆలోచనతట్టినపుడే అమలుకుతీసుకోనిర్ణయము దీపముండగానే చక్కబెట్టుకోగృహము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 కవిత్వలక్షణాలు కవిత్వం చూపాలి పదచిత్రాలు వాడాలి తగుప్రతీకలు తట్టాలి అంతరంగాలు కవిత్వం ఒక్క కుటీరానికో కొద్ది కాగితాలకో కారాదు పరిమితము కవిత్వం కురవాలి టపటపా పారాలి గలగలా మ్రోగాలి గళగళా కవిత్వం గుమ్మంగుండానో కిటికీగుండానో పరుగెత్తాలి బయటకు కవిత్వం కళ్ళద్వారానో శబ్దంద్వారానో చేరాలి మనసుకు కవిత్వం పాఠకులకు శ్రోతలకు వేయరాదు సంకెళ్ళు కవిత్వం సుమములా సుగంధంలా ఆకర్షించాలి హృదయాలు కవిత్వం తీర్చాలి కాంక్షలు  ఇవ్వాలి అనుభూతులు కూర్చాలి ప్రత్యక్షఙ్ఞానము కవిత్వం చూపించాలి అందాలు కలిగించాలి ఆనందము చేకూర్చాలి శాంతము  కవిత్వం చిమ్మలి కాంతికిరణాలు చల్లాలి వెన్నెలజల్లులు చూపాలి తళుకుబెళుకులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవి తలపులు ఊహలు  ఊరించనా విషయాలు  ఎరిగించనా అక్షరాలు  అల్లనా  పదాలు  పేర్చనా  కవిత్వము  రాయనా గీతము  ఆలపించనా కళ్ళను  కట్టేయనా మదులను  దొచేయనా జోలపాట  పాడనా  డొలపట్టి  ఊపనా  మాటలు  వదలనా తేనెబొట్లు  చిందనా ముచ్చట్లు  చెప్పనా చప్పట్లు  కొట్టించనా ముద్దులు  పెట్టనా మురిపెము  చేయనా వెన్నెల  వెదజల్లనా హాయిగ  విహరింపజేయనా మల్లెలు  చల్లనా మత్తునందు  దించనా గళము  విప్పనా స్వరాలు  కురిపించనా నిద్దుర  పుచ్చనా మేలుకొలుపు  పాడనా పాఠకులను మెప్పించనా పొగడ్తలను స్వీకరించనా కవిరాజునని చాటనా కవనజగతిని ఏలనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 చల్లు చల్లు చల్లు... చల్లు చల్లు చల్లు వెన్నెలజల్లు చల్లు మదులకు మోదమివ్వు చల్లు చల్లు చల్లు నవ్వులజల్లు చల్లు మోములకు వెలుగులనివ్వు                ||చల్లు|| చల్లు చల్లు చల్లు పూలరెమ్మలు చల్లు సంతోషములనివ్వు చల్లు చల్లు చల్లు కాంతికిరణాలు చల్లు జగతిని చైతన్యపరచు           ||చల్లు|| చల్లు చల్లు చల్లు పన్నీటిబొట్లు చల్లు పరిమళాలు వెదజల్లు చల్లు చల్లు చల్లు తేనెచుక్కలు చల్లు నోర్లకు తీపినివ్వు                ||చల్లు|| చల్లు చల్లు చల్లు  చక్కనిచూపులు చల్లు ప్రేమాభిమానాలు చాటు చల్లు చల్లు చల్లు మధురవాక్కులు చల్లు తనువులకు తృప్తినివ్వు             ||చల్లు|| చల్లు చల్లు చల్లు రాగసుధలు చల్లు వీనులకు విందునివ్వు చల్లు చల్లు చల్లు అక్షరముత్యాలు చల్లు కమ్మనికవితలు కూర్చు          ||చల్లు|| గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితలకోసం కమ్మని కవితను రాయమని ఎన్ని ఆలోచనలు వెంటబడుతున్నాయో తియ్యని కవితను కూర్చమని ఎన్ని భావాలు తలనుతడుతున్నాయో మంచి కవితను సృష్టించమని ఎన్ని అక్షరముత్యాలు చెంతకొస్తున్నాయో గొప్ప కవితను అల్లమని ఎన్ని పదాలు ప్రాధేయపడుతున్నాయో కవితాసౌరభాలు వెదజల్లమని ఎన్ని పూలు ప్రేరేపిస్తున్నాయో రంగులకవితను రచించమని ఎన్ని హరివిల్లులు దర్శనమిస్తున్నాయో ముచ్చటయిన కవితను వెల్లడించమని ఎన్ని మాటలు మదినిముట్టుతున్నాయో చక్కని కవితను సమకూర్చమని ఎన్ని గళాలు కోరుతున్నాయో కవితలలో వెలుగులు ప్రసరించమని ఎన్ని దీపాలు వెలిగించమంటున్నాయో తేటతెలుగు కవితను లిఖించమని ఎన్ని మాటలు ముందుకొస్తున్నాయో విడవక కైతలను వ్రాస్తా వివిధ మాధ్యమాలకు పంపిస్తా తప్పక కవనాలు అందిస్తా పాఠకుల మదులలో నిలిచిపోతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 రోజూ రాస్తా నిత్యము చదివిస్తా విరిసిన పువ్వులు మత్తుచల్లుతుంటాయి వెన్నెల వాన తనువును తడుపుతుంటాయి మత్తు నిద్ర కలలలోకంలోకి తీసుకెళ్తుంది హృదయము కవ్వింపులకు గురవుతుంది శ్రావ్యమైన పాట వీనులకు విందునిస్తుంది తియ్యని పలుకులు తేనెచుక్కలు చిమ్ముతుంటాయి అందచందాలు ఆకర్షిస్తుంటాయి ఆనందాలను అంతరంగంలోపారిస్తుంటాయి చిరునవ్వులు మోమునువెలిగిస్తుంటాయి ప్రేమాభిమానాలు గుండెలో పొంగిపొర్లుతుంటాయి పచ్చని చెట్లు గాలికి తలలూపుతుంటాయి నీడలో సేదతీరమని చెంతకు పిలుస్తుంటాయి కొత్త విషయాలు మదిలో పుడుతుంటాయి చక్కని భావమును వ్యక్తపరచమంటుంటాయి అక్షరలోకం విహారానికి పిలుస్తుంది పదాలప్రపంచం పలుపంక్తులను పేర్చమంటుంది తేటతెలుగు తొందరపెడుతుంది అచ్చతెలుగు వెంటబడుతుంది ఫలితం కలం కదలటం కవిత్వం కాగితానికి ఎక్కటం ప్రతిరోజు ఏదో రాస్తుంటా అనునిత్యము ఏదో చదివిస్తుంటా తెలుగు తల్లికి మల్లెపూదండలు పలుకుల తల్లికి కర్పూరహారతులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 వనితలకి వందనాలు పురుషుడికి శక్తి ఉన్నది యుక్తి ఉన్నది మగవారికి అందాలు ఉన్నాయి ఆకర్షణలు ఉన్నాయి మొగవాళ్ళకి సద్గుణాలు ఉన్నాయి సంస్కారాలు ఉన్నాయి పూరుషులకి ప్రేమ ఉన్నది భ్రమ ఉన్నది మగమహారాజులకి పౌరుషాలు ఉన్నాయి పరాక్రమాలు ఉన్నాయి పురుషజాతికి తెగువ ఉన్నది తెలివి ఉన్నది పుంలింగులకు సాహసము ఉన్నది శౌర్యము ఉన్నది అవన్నీ అమ్మగా అర్ధాంగిగా చెలిగా చెల్లిగా అక్కగా అంగజగా స్త్రీ మగవారికిచ్చి ఆఖరికి వారిచేతుల్లో ఆటబొమ్మవుతుంది స్త్రీమూర్తులు ప్రోత్సాహకులు త్యాగధనులు  అట్టి స్త్రీజాతి ఔన్నత్యాలకు  వందనాలు ధన్యవాదాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
 పాపం మగమహారాజులు  పూలు  ఆడవాళ్ళ సొంతమట  వారే  అలంకరించుకోవటానికి అర్హులట  పూలు  పొంకాలు చూపుతాయట  అతివలు  అందాలు చిందుతారట పూలు  సుకుమారంగా ఉంటాయట  పడతులు   సుతిమెత్తంగా ఉంటారట  పూలు  పలువర్ణాలలో ఉంటాయట  మగువలు   పలురకాలబట్టలు ధరిస్తారట  పూలు  పరిమళాలు చల్లుతాయట  స్త్రీలు  సౌరభాలు వెదజల్లుతారట  పూలు  మత్తును ఎక్కిస్తాయట  మహిళలు  మైకము కలిగిస్తారట  పూలు  ప్రేమకు ప్రతీకలట  అంగనలు  ప్రేమకు ఆలవాలమట  పూలమీద  ఇంతులదే గుత్తాధిపత్యమట  పురుషులకు  ఇవ్వటానికే  అధికారమట  కావాలంటే  మగవారు చెవుల్లోపెట్టుకోవచ్చట  లేకపోతే  చేతులకు మాలలుచుట్టుకోవచ్చట  మొగవారు  మంచాలమీద చల్లుకోవచ్చట మైమరచి  నిద్రలోకి జారుకోవచ్చట  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 తేనీటి తేటకవిత  తేనీరు వేడిగ త్రాగుతుంటే ఊహలు ఉల్లాన ఉరుకులెత్తుతాయి తేనీరు పొగలు క్రక్కుతుంటే కలము కైతలు కారుస్తుంది తేనీరు గటగటా సేవిస్తుంటే పేపరు చకచకా నింపమంటుంది తేనీరు రుచిని చూపుతుంటే గళము గొంతెత్తి రాగంతీస్తుంది తేనీరు మదిని ఉబికిస్తుంటే తేటతెలుగు హృదిని తట్టిలేపుతుంది తేనీరు సువాసన వెదజల్లుతుంటే కవిత్వము సౌరభాలను చిమ్ముతుంది తేనీరు చెంతకు పిలుస్తుంటే నిద్రమత్తు త్రాగి వదిలించుకోమంటుంది తేనీరు కవితను వ్రాస్తా తెలుగు తీపిని అందిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 ఎవరో నన్ను చదువుతున్నారు? ఎవరో నన్ను చూస్తున్నారు ఎందుకో మంచిగా మాట్లాడుతున్నారు ఎవరో నన్ను పలుకరిస్తున్నారు ఎందుకో చెంతకురమ్మని స్వాగతిస్తున్నారు ఎవరో నన్ను చదువుతున్నారు ఎందుకో పలువురికి పరిచయంచేస్తున్నారు ఎవరో నన్ను ముట్టుకుంటున్నారు ఎందుకో  మహదానందంలో తేలిపోతున్నారు ఎవరో నన్ను తడుముతున్నారు ఎందుకో ఆప్యాయత చూపిస్తున్నారు ఎవరో నన్ను పొగుడుతున్నారు ఎందుకో ఆకాశానికి ఎత్తుతున్నారు ఎవరో నన్ను దీవిస్తున్నారు ఎందుకో నూరేళ్ళు జీవించమంటున్నారు ఎవరో నన్ను గమనిస్తున్నారు ఎందుకో నాపుస్తకాన్ని తెరచిపెట్టమంటున్నారు నా నోట్లో బంగారుచంచా ఉన్నది నా వెనుక అపారసిరిసంపదలు ఉన్నాయి నా చేతిలో కమ్మని కవితలున్నాయి నా గళాన తియ్యని స్వరాలున్నాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కలవరమాయె మదిలో... ఆమెమోము ధగధగావెలిగిపోతుంది పకపకానవ్వులుచిందుతుంది ఆమెకళ్ళు కళకళలాడుతున్నాయి కాంతులుచిమ్ముతున్నాయి ఆమెరూపము అందముచూపుతుంది ఆనందంపొందమంటుంది ఆమెపలుకులు తేనెచుక్కలుచిందుతున్నాయి చెరకురసాన్నితలపిస్తున్నాయి ఆమెబుగ్గలు సిగ్గులొలుకుతున్నాయి ఎర్రబడుతున్నాయి ఆమెచేతిగాజులు గలగలమ్రొగుతున్నాయి గుబులులేపుతున్నాయి ఆమెకాళ్ళగజ్జెలు ఘల్లుఘల్లుమంటున్నాయి హృదిలోసవ్వడిచేస్తున్నాయి ఆమెనుదుటబొట్టు వెలిగిపోతుంది స్వాగతిస్తుంది ఆమెకాటుకకళ్ళు తిరుగుతున్నాయి తొందరపెడుతున్నాయి ఆమె వలవిసురుతుంది మత్తెక్కిస్తుంది చూపును ఎలా మరల్చను కైపును ఎట్లావదిలించుకోను కోర్కెను ఏరీతిన తీర్చుకోను కవ్వింపును ఏవిధానతట్టుకోను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  
Image
 తల్లుల్లారా....తండ్రుల్లారా.... పాపాయలను వద్దనకండి పురిటిలోనే చంపేయకండి  ఆడామగా సమానమనండి  అబలలంటు అలుసుచేయకండి బాలికలను ప్రేమించండి  ఆడామగాభేదము చూపించకండి మగువను లక్ష్మీదేవియనుకోండి మహిళను అన్నపూర్ణమాతనుకోండి అమ్మాయినిపెరటిపువ్వుగా భావించండి  అందాలగుమ్మగా తీర్చిదిద్దండి  తరుణులకు విద్యాబుద్ధులునేర్పండి వినయవిధేయతలు అలవరచండి  పాపలను అక్కునచేర్చుకోండి బాలికలపై మక్కువచూపించండి  ఆడువారిని తక్కువచెయ్యకండి అభిమానించి ఎక్కువఆదరించండి  అంగనలను అన్నిటిలోను మిన్నగాచూడండి  అన్నివేళల్లోను అండగానిలవండి  సుగుణాలరాశిగా తయారుచేయండి  శీలవతిగా తీర్చండి పెద్దచేయండి  భార్యలను జీవితతోడునీడలనుకోండి అక్కాచెల్లెల్లను అనురాగప్రతీకలుగాతలవండి ఆడది ఆటవస్తువుకాదనిచాటండి  అతివ అంగడిబొమ్మకాదనిచెప్పండి   అందానికిప్రతీకలు భామలనండి  అనురాగానికినెలవు లేమలనండి  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం