పెళ్ళాం
కళత్రం
నాకు ప్రాణం
చక్కగా చూచుకుంటా
పెళ్ళాం
నాకు దీపం
ఇంటిని వెలిగించమంటా
పెండ్లాం
నాకు బెల్లం
కడుపులో దాచుకుంటా
భార్య
నాకు యుగళం
విడువక ప్రక్కనుంచుకుంటా
అర్ధాంగి
నాకు అందం
ఆనందం పంచుకుంటా
ధర్మపత్ని
నాకు బంధం
చిరకాలం నిలుపుకుంటా
పత్ని
నాకు అర్ధదేహం
నాతో సమానంగాచూస్తా
సతి
నాకు మంత్రణం
సలహాలు తీసుకుంటా
ఆలి
నాకు అమృతం
సంతోషంగా స్వీకరిస్తా
దార
నాకు కాలక్షేపం
ఎక్కువసమయం గడుపుతా
కళ్ళాలు
నాకు గౌరవప్రదాయం
గర్వంగా తలనెత్తుకొనితిరుగుతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
(నిన్న ఒక అభిమాని పెళ్ళాం గురించి కవిత వ్రాయమని కోరారు. సరేనని ఒప్పుకున్నా. దాని పర్యావసానమే నేటి నా కవిత.)
Comments
Post a Comment