అక్షరాల ఆహ్వానం అక్షరాలు రమ్మంటున్నాయి — అంతరంగ ద్వారాలు తట్టుతూ మౌనపు ముసుగులు తొలగించి మనసుని వెలుగులో నింపమంటున్నాయి… అక్షరాలు రాయమంటున్నాయి — ఆలోచనల ఆకాశంపై కలల్ని రెక్కలుగా కట్టి కవితలుగా కురిపించమంటున్నాయి… అక్షరాలు అలంకరించమంటున్నాయి — భావాల బొమ్మలపై భాషా రంగులు పూసి సౌందర్యాన్ని చిమ్మమంటున్నాయి… అక్షరాలు అలరించమంటున్నాయి — మధుర గీతాల లయలో మనసుల్ని మురిపించి మురళీ స్వరాల మ్రోగించమంటున్నాయి… అక్షరాలు అల్లమంటున్నాయి — ఊహల ఉయ్యాలల్లో ప్రేమ తంతువులతో కవితల పూదోట నేయమంటున్నాయి… అక్షరాలు చల్లమంటున్నాయి — చింతల వేడి మోపిన హృదయాలపై స్నేహపు చినుకులై శాంతిని చిందించమంటున్నాయి… అక్షరాలు ఆడమంటున్నాయి — పదాల పందిరిలో పలుకుల పల్లకిలో పిల్లల హాస్యంలా విరియమంటున్నాయి… అక్షరాలు పాడమంటున్నాయి — పలుకుల పాటలలో ప్రేమ రాగాలపై ప్రపంచాన్ని మైమరపించమంటున్నాయి… అక్షరాలు మ్రోగించమంటున్నాయి — నిజాల నాదాలై నిర్భయ స్వరాలై నిశ్శబ్దాన్ని ఛేదించమంటున్నాయి… అక్షరాలు వెలిగించమంటున్నాయి — అజ్ఞాన అంధకారంలో జ్ఞాన దీపాలై జీవిత మార్గాన్ని చూపమంటున్నాయి… అక్షరాలే ఆణిముత్యాలు — అక్షరాలే అపురూపాలు — అక్షరాలే అమారజీవ...