నీవొకటంటే నేపదంటా
తిరిగే కాళ్ళు
తిట్టే నోర్లు
ఊరకుంటాయా
నీవు ఒకటంటే
నేను పదంటా
లెక్కబెడతావా
రాసే కలాలు
పాడే గళాలు
గమ్ముగుంటాయా
పారే నదులు
ఊరే జలాలు
నిలిచిపోతాయా
వీచే గాలులు
ఊగే కొమ్మలు
ఆగిపోతాయా
తేలే మేఘాలు
కారే చినుకులు
వద్దంటేవింటాయా
మొరిగే కుక్కలు
ఊళలేసే నక్కలు
వలదంటేఊరుకుంటాయా
పుష్పాల పొంకాలు
సుమాల సౌరభాలు
ఆస్వాదించకుండతరమా
సూర్యుని కిరణాలు
చంద్రుని కళలు
మట్టుబెట్టగలమా
తారల తళుకులు
దీపాల వెలుగులు
నిరోధించగలమా
మోముల నవ్వులు
కన్నుల కాంతులు
కనకతలలుతిప్పగలమా
మది తలపులు
హృది ఉల్లాసాలు
కట్టడిచేయగలమా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment