నేతలారా! 


ప్రజలంటే

అమాయకులు కాదోయ్

చెప్పినవన్నీ నమ్మటానికి

చెప్పినట్లు తలలూపటానికి


ప్రజలంటే

గొర్రెలు కాదోయ్

ఒకేదారిన నడవటానికి

గుడ్డిగా ప్రవర్తించటానికి


ప్రజలంటే

అవినీతిపరులు కాదోయ్

డబ్బులు తీసుకోవటానికి

ఓట్లు అమ్ముకోవటానికి


ప్రజలంటే

పశువులు కాదోయ్

గాటిన కట్టేయటానికి

పనులు పురమాయించటానికి


ప్రజలంటే

పోకిరీలు కాదోయ్

గొడవలు చేయటానికి

గోతుల్లో తోయటానికి


ప్రజలంటే

గాడిదలు కాదోయ్

దెబ్బలు తినటానికి

బరువులు మోయటానికి


ప్రజలంటే

కుక్కలు కాదోయ్

కాపలా కాయటానికి

గట్టిగా మొరగటానికి


ప్రజలంటే

తాగుబోతులు కాదోయ్

మధ్యానికి బానిసలుకావటానికి

సారానిచ్చినవారిని గెలిపించటానికి


ప్రజలంటే

తిండిబోతులు కాదోయ్

బిర్యానిపొట్లాలకు లొంగటానికి

బటన్లను నొక్కటానికి


ప్రజలంటే

మేధావులోయ్

ఆలోచించటానికి

నిర్ణయాలుతీసుకోవటానికి


ప్రజలంటే

చైతన్యపరులోయ్

నిజాలనుచూడటానికి

న్యాయంగామెలగటానికి


ప్రజలంటే

సంఘజీవులోయ్

కలసిబ్రతకటానికి

పరస్పరంసహాయంచేసుకోవటానికి


ప్రజలంటే

ఓటరుమహాశయులోయ్

అభిమతంతెలియజేయటానికి

అభివృద్ధికాముకులనెన్నుకోవటానికి


ప్రజలంటే

ప్రజాసామ్యవాదులోయ్

ప్రజలకొరకు ప్రజలచేత

ప్రజలేపాలించే ప్రభుత్వాన్నికోరేవారోయ్


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog