ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల
వేదిక నాల్గవ సమావేశం
నేడు 07-01-25వ తేదీ ఎ ఎస్ రావునగర్ హైదరాబాదులో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన నాల్గవ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం. సభకు అధ్యక్షత వహించిన సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందని కొనియాడారు. ముఖ్య అతిధి నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాస్ గారు మాట్లాడుతూ ఎడారులలోనూ భూమినుండి నీరు పొంగి పొర్లటం చూచామని, అట్లే కవుల మనసులలోని భావాలు మంచి కవితలుగా ప్రవహించాలని, అనుభూతులను కవితలలో వ్యక్తపరచి కవులు అభివృద్ధిలోకి రావాలని కోరారు. విశిష్ట అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు మాట్లాడుతూ స్తాపించిన కొద్దికాలంలోనే కాప్రా మల్కాజగిరి కవుల వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు, కవులకు మంచి ప్రోత్సాహిమిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
ప్రముఖకవి నూతక్కి రాఘవేంద్రరావు గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్తర్ రాధాకుసుమ గారు, అక్షర కౌముది సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు గారు, నంది అవార్డు గ్రహీత సినీ నిర్మాత దర్శకుడు దీపక్ న్యాతి గారు మరియు కార్యక్రమ సమన్వయ కర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ప్రసంగించారు.
డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా కవిసమ్మేళనం నిర్వహించారు. 28 మంది కవులు కవిసమ్మేళనంలో పాల్గొని చక్కని కవితలు చదివి వినిపించారు. ముఖ్య అతిధి బైస దేవదాస్ గారు మరియు విశిష్ట అతిధి డాక్టర్ ఆలపాటి గారు కవులను శాలువాలు కప్పి, ఙ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. దీపక్ న్యాతి గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment