కవి ఏంచేస్తాడు?
కవితలకు
ప్రాణంపోస్తాడు
కవిబ్రహ్మగా
పిలవబడతాడు
అక్షరాలను
అల్లుతాడు
అర్ధాలను
స్ఫురింపజేస్తాడు
పదాలను
ప్రయోగిస్తాడు
ప్రాసలతో
పసందుచేస్తాడు
వివిధాంశాలు
చేబడతాడు
విన్నూతనంగా
విరచిస్తాడు
మనసులను
హత్తుకుంటాడు
ఆలోచనలను
రేకెత్తిస్తాడు
ప్రకృతిని
చూపిస్తాడు
పరవశం
కలిగిస్తాడు
ప్రేమలకు
ప్రాముఖ్యమిస్తాడు
బంధాలకు
బంధీలనుచేస్తాడు
స్నేహాలకు
విలువనిస్తాడు
స్నేహమే
జీవితమంటాడు
మగువలను
మెచ్చుకుంటాడు
మర్యాదగా
మెలగమంటాడు
అందాలను
చూపిస్తాడు
అందరినీ
ఆకట్టుకుంటాడు
పువ్వులను
పూయిస్తాడు
నవ్వులను
కురిపిస్తాడు
ఆనందంలో
ముంచుతాదు
అంతరంగాలలో
నిలుస్తాడు
సూర్యోదయం
చూస్తాడు
కవితోదయం
చేస్తాడు
శారదాదేవిని
తలుస్తాదు
కమ్మనికవితలు
కూర్చుతాడు
కలమును
చేబడతాడు
కాగితాలను
నింపుతాడు
వేలకైతలు
వ్రాస్తాడు
కవనలోకాన
నిలిచిపోతాడు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment