ఆద్యంతం అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 12వ సమావేశం

****************************************************************


నిన్న 27-9-25వ తేదీన ఎ.ఎస్.రావునగర్ లో కాప్రా మలకాజగిరి కవుల వేదిక 12వ సమావేశం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన కళారత్న మరియు నవ్యాంధ్ర రచయతల సంఘం అధ్యక్షులు శ్రీ బిక్కి క్రిష్ణ గారు, 28వ తేదీ జాషూవా జయంతి సందర్భంగా మహకవి జాషువా జయంతోత్సవం ఘనంగా  నిర్వహించటం  సంతోషదాయక విషయమన్నారు. జాషూవా తన జీవితమంతా అణగారిన వర్గాలకోసం అంకితం చేశారన్నారు. చక్కని ఖండ కావ్యాలు వ్రాసి తెలుగు సాహిత్యంలో స్థిరస్థానం సంపాదించుకున్నారన్నారు. ముఖ్య అతిధి,కవి,పరిశోధకులు మరియు విమర్శకులు శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు జాషువా మహా గొప్ప కవి అని ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. జాషువా గారి పద్యాలను చక్కగా ఆలపించి అందరిని అలరించారు. విశ్రాంత అటవీ శాఖ అధికారి, సాహిత్య ప్రియుడు మరియు గొప్పదాత శ్రీ అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు జాషువా గురించి చాలా విషయాలి చెప్పి వారి పద్యాలను కొన్ని వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. బాలసాహిత్య కవి శ్రీ గద్వాల సోమన్న వ్రాసిన 78వ పుస్తకం ఊతకర్రను శ్రీ క్రిష్ణరెడ్డి గారు ఆవిష్కరించారు. సోమన్న గారిని ఘనంగా అతిధులు సత్కరించారు. మొదట ఇటీవల డాక్టరేట్ పొందిన శ్రీ తులసి వెంకట రమణాచార్యులు స్వాగత వచనలతో అతిధులను పరిచయంచేసి వేదికపైకి ఆహ్వానించారు.


సమావేశానికి ముందు శ్రీమతి పొన్నాల ధనమ్మారెడ్డి నేతృత్వంలో మహిళలు అమిత ఉత్సాహంతో బతకమ్మ ఆటలు ఆడి, పాటలు పాడి వచ్చిన వారందరిని ఉల్లాసపరిచారు.


మొట్టమొదట కవిసమ్మేళన సామ్రాట్, కవయిత్రి, గాయకురాలు, కుసుమ ధర్మన్న మనుమరాలు శ్రీమతి రాధా కుసుమ చిరునవ్వులతో, వ్యాఖ్యలతో నిర్వహించారు. మొదట భక్తిపాట రాగయుక్తంగా పాడి శుభారంభాన్ని ఇచ్చారు. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు రాజరాజేశ్వరిని స్తుతిస్తూ చక్కని కవిత వినిపించారు. కాదంబరి క్రిష్ణప్రసాద్ ఎందరో 

మహానుభావులు వారికి వందనాలు అని, మిద్దె సురేష్  జాషూవపై కవిత, కోకిల సుజాత పుట్టింటి వైభవం బతుకమ్మ అని, పంతుల లలిత కవిత్వంలో ఇమిడిన జీవితం అని, మంత్రిప్రగడ మార్కండేయులు గుర్రం జాషూవా పై, అనంతాత్ముల శ్రీనివాసరావు నన్ను ప్రభావితం చేసిన వారు, కె ఎల్ కామేశ్వరరావు యత్ర నార్యంతి పూజ్యయంతే, కాసర్ల సరోజినిదేవి పవిత్ర ప్రదేశం, చుండురి శేషమాంబ ఒక వీర గాధ, అర్వా రవీంద్రబాబు తరంగ హృదయం, గూండ్ల నారాయణ అమ్మా నాన్నలు, కె సుబ్బారావు జాషువా కలలు నిజం చేయాలని, కట్టా శ్యామలాదేవి కొన్ని కందపద్యాలు, దీకొండ చంద్రకళ మహితాత్ములు, మధుసూధనరావు పద్యాలు, అవుసలి ఆంజనేయులు బతుకమ్మ పండుగ, మాణిక్యలక్ష్మి బతుకమ్మ పాట, బుక్కపట్నం రమాదేవి గెలుపు చేతను, ఆచార్య ఫణీంద్ర జాషూవా పై పద్యాలు, బిటవరం శ్రీమన్నారాయణ అసమంజసం, తోకల సాంబశివరావు తెలుగు స్వరం అనే కవితలను వినిపించి శ్రోతల అభిమానాన్ని అందుకున్నారు.దైవాధీనం విశ్వనరుడు, ముగ్ధ మాధవి అమ్మవారిపై, బి వి వి ఎస్ ప్రసాద్ ఆటవెలది పద్యాలు, సంపంగి నరసింహులు బతుకమ్మపై, ఐ రాజ్యలక్ష్మి దసరా పై, ఎస్ వెంకటనారాయణ బతుకమ్మ పాట, తాతపూడి సోమశేఖరశర్మ చక్కని రాగయుక్త పాటను, మేడిసెట్టి వెంకటేశ్వర్లు సమాజానికి వెలుగు జాషువా అని, నక్కా శ్రీనివాస్ మహిళలకు ప్రణామం అని, పొన్నాల ధనమ్మ ఏమయ్యా అని తనపెళ్ళి పై కవితని వినిపించారు. చివరగా సమన్వయ కర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మన జాషువా అంటూ అద్భుతమైన కవితను చదివి కవిసమ్మేళనానికి చక్కని ముగింపు ఇచ్చారు.


సమావేశాన్ని  హుందాగా నిర్వహించి, కవులను ప్రోత్సహించుతూ, మహిళలతో బతకమ్మ ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ జరిపినందుకు నిర్వాహకులను, కవులను, పాల్గొన్న మహిళలను బిక్కి క్రిష్ణ గారు అభినందించారు. చివరగా ధరణీ మహిళాశక్తి అధ్యక్షురాలు శ్రీమతి పి ధనమ్మ గారి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, సమన్వయకర్త, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 




Comments

Popular posts from this blog