కాలిఫోర్నియా వీక్షణం 13వ వార్షిక సమావేశం

ఆవిష్కరించబడిన వీక్షణం రెండు పుస్తక సంపుటాలు - ఉత్సాహభరితంగా జరిగిన 157వ కవిసమ్మేళనం

****************************************************************


నేడు 20-09-2025వ తేదీన జరిగిన వీక్షణం 157వ అంతర్జాల సమ్మేళనంలో విశ్రాంత ఆచార్యులు, శ్రీ క్రిష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం, శ్రీ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు వీక్షణం 13వ వార్షికోత్సవం సందర్భంగా 112 కవితలు, కధలు,వ్యాసాలతో కూడిన సాహితీ మిత్రుల రచనల సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సంకలనం చాలా బాగున్నదని, కవితలు, కథలు మరియు వ్యాసాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. వీక్షణం 13 సంవత్సరాలూగా తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలను కొనియాడారు. కొన్ని కవితలను లోతుగా విశ్లేషించారు. అధ్యక్షులు గీతా మాధవి గారిని, భారతీయ ప్రతినిధి రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు. వీక్షణం గత 12 నెలల సమీక్షల సంపుటిని కవి, విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఇందులో వేమూరి వెంకటేశ్వర్లు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేయటం మరియు 150వ సమావేశం సందర్భంగా 150 కవితలతో కవితల సంపుటి తీసుకొని రావటం ముఖ్య సంఘటనలు అని చెప్పారు. ప్రముఖ అతిధులతో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించటం తెలుగు సాహిత్యానికి వీక్షణం అందిస్తున్న గొప్ప సేవగా పేరొన్నారు.


ఈ సమావేశం మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారి అతిధుల, కవుల స్వాగతంతో ప్రారంభమయ్యింది.ఆమె క్లుప్తంగా వీక్షణం సంస్థ ఉద్ధ్యేశ్యాల గురించి చెప్పారు. గీత గారు 13 సంవత్సరాల వీక్షణం చేపట్టిన సాహితీ సేవలను తెలియపరిచారు.


పిమ్మట గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మరియు కవిసమ్మేళన సామ్రాట్టు రాధా కుసుమ గారు కవిసమ్మేళనం నిర్వహించారు.

మొదట గీతా మాధవి గారు వీక్షణాలు శుభక్షణాలు అనే కవితను చక్కగా చదివి అందరినీ ఆకట్టుకున్నారు. ఆది మోపిదేవి గారు వాగుదాహం అనే కవితను వినిపించారు.శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు కళల తీరం ఆనవాళ్ళు అనే కవితను చదివారు. డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు జీవన గ్రంధం, కొత్తూరు వెంకట్ గారు అష్టాదశ పురాణాలు, బలుసాని వనజ అవని కోపించిన వేళ, నాళేశ్వరం శంకరం గారు రజిత రణం, పెరుగు రామక్రిష్ణ గారు దిక్సూచి, వైరాగ్యం ప్రభాకర్ గారు మానవతావాది, రామాయణం ప్రసాదరావు గారు ఎవరువాడు అనే కవితను చక్కగా చదివి అందరినీ అలరించారు.


     రామక్రిష్ణ చంద్రమౌళి గారు ప్రియమిత్రుడు, డాక్టర్ కోదాటి అరుణ గారు నేటి మహిళలకు ఆదర్శం సీత, అవధానం అమృతవల్లి గారు గుండె తడికై ఎదురుచూస్తూ, పరిమి వెంకట సత్యమూర్తి గారు మట్టిపాత్రలపాత్ర, పంతుల లలిత గారు మన భవిష్యత్తుకు సోపానం నాన్న, అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు మనోమధనం, బృందా గారు ఓ జోన్ పొర, ఉప్పలపాటి వెంకట రత్నం గారు వయసు మల్లిన వయసు, కందుకూరి శ్రీరాములు గారు కవిత, దీపక్ న్యాతి గారు గోమాత, చిట్టాబత్తిన వీర రాఘవులు గారు జీవన పోరాటం, నెల్లూరి ఇందిర గారు శార్దూల వైరాగ్యం, డాక్టర్ రాధా కుసుమ గారు తీర్చుకోలేని ఋణం, కట్టా శ్యామలాదేవి గారు అనుబంధాలు - ఆప్యాయతలు, బుక్కపట్నం రమాదేవి గారు రెప్ప వాల్చని నిద్దుర అనే కవితలను శ్రావ్యంగా వినిపించారు.


     పరాంకుశం కృష్ణవేణి గారు ఆత్మీయ సముద్రం, జె వి కుమార్ చేపూరి గారు చింత చచ్చినా, శోభ దేశ్ పాండె గారు వాల్మీకి, భోగెల ఉమామహేశ్వరరావు గారు గురజాడ, కొలచన శ్రీసుధ గారు ఏముందీ ఏమీలేదు , ఆనం ఆశ్రితారెడ్డి గారు నా తెలుగు తోరణం, ముగ్ధ మాధవి గారు ప్రజల హృదయ కవి (దాశరధి), చిరంజీవి చిన్మయి మట్టివాసన చెప్పేది, డాక్టర్ సి.ఉమాప్రసాద్ గారు అమృతభారతి, గాయత్రి చిరుమామిళ్ళ అభాగ్యులెందరో, కోపల్లె మణి గారు నుడికారాల భాషా సౌందర్యం తెలుగు భాష, తన్నీరు శశికళ గారు కోయిలా అనే గేయాన్ని ఆలపించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు రండి.. రారండి అంటూ కవులను ఆహ్వానిస్తూ భావయుక్తంగా కవితను వినిపించి ఆకట్టుకున్నారు.


చివరగా నిర్వాహకురాలు అతిధికి, కవులకు, సాహితీ ప్రియులకు సమ్మేళనాన్ని జయప్రదంగా జరిపించటానికి సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పి సమావేశాన్ని ముగించారు.సమావేశం చాలా బాగా నిర్వహించారని కవులు తమ సంతోషం వ్యక్తపరిచారు.


గీతామాధవి కళా & గుంద్లపల్లి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు, వీక్షణం సాహిత్య వేదిక.


Comments

Popular posts from this blog