జంకకురా తెలుగోడా!
జంకు ఎందుకురా తెలుగోడా
బెణుకు ఎందుకురా తెలుగోడా
వెన్నుగా నిలువరా తెలుగోడా
దన్నుగా నిలువరా తెలుగోడా ||జంకు||
తెలుగు వెలుగులు చిమ్ముననరా
తెలుగు తేనియలు చిందుననరా
తెలుగు తేటనైనది అనిచెప్పరా
తెలుగు లెస్సైనది అనితెలుపరా
తెలుగు అక్షరాలు సుందరమనురా
తెలుగు పదాలు కొబ్బరిపలుకులనరా
తెలుగు ముత్యాలను సరాలుగాగుచ్చరా
తెలుగు రత్నాలను వరుసగాపేర్చరా ||జంకు||
మనతెలుగు వరాలతల్లి అనరా
మనతెలుగు మహాగొప్పజాతి అనరా
మనతెలుగు బహుచక్కన అనరా
మనతెలుగు అతిసౌరభము అనరా
తెలుగు హలమును చెతపట్టరా
తెలుగు విత్తులను చుట్టూనాటరా
తెలుగు పంటలను పండించరా
తెలుగు సేద్యమును సాగించరా ||జంకు||
తెలుగు భాషను నేర్పించరా
తెలుగు వేషములు వేయించరా
తెలుగు చరిత్రను చాటరా
తెలుగు సంస్కృతిని కాపాడరా
తెలుగు తల్లులా పొగడరా
తెలుగు బిడ్డలా పోషించరా
తెలుగు ప్రేమను చూపించురా
తెలుగు రాగములు ఎత్తుకోరా ||జంకు||
తెలుగు ఇలసాటి లేనిదనరా
తెలుగు కడుమేటి అనిమెచ్చరా
తెలుగు విశ్వఖ్యాతి పొందినదనరా
తెలుగు జగత్వాప్తి చెందినదనరా
తెలుగు సాహితిని వ్యాపించరా
తెలుగు జగతిని కొనియాడరా
తెలుగు వారికి జైజైలుకొట్టరా
తెలుగు నేలకు జేజేలుపలుకరా ||జంకు||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment