కవనగతులు
ఏ గతి వ్రాయను
ఏ రీతి చాటను
ఏ స్తుతి చేయను
ఏ శృతి ఎత్తను
ఏ శైలి చేపట్టను
ఏ దారి నడవను
ఏ తీరు పాటింతును
ఏ పేరు సాధింతును
ఏ బొమ్మలు గీయను
ఏ రంగులు అద్దను
ఏ శిలలు చెక్కను
ఏ రూపాలు చూపను
ఏ స్వరాలు పలుకను
ఏ రాగాలు తీయను
ఏ విషయము ఎంచను
ఏ విధానము ఆచరించను
ఏ ప్రక్రియ అనుసరించను
ఏ ప్రతిచర్య అందుకొందును
ఏ విందు అందించను
ఏ పసందు చేకూర్చను
ఏ ఊహలు పారించను
ఏ భ్రమలు కలిగించను
ఏ అందాలు చూపను
ఏ ఆనందం పంచను
ఏ తేనెచుక్కలు చిలికించను
ఏ మాధుర్యం చవిచూపను
ఏ సౌరభం చల్లను
ఏ ప్రభావం చూపను
ఏ ఆట ఆడించను
ఏ పాట పాడించను
ఎవ్వరిని తట్టను
ఎవ్వరిని ముట్టను
ఏ పంటలు పండించను
ఏ వంటలు వడ్డించను
ఏ పువ్వులు పూయించను
ఏ నవ్వులు చిందించను
ఎన్ని మదులు మురిపించను
ఎన్ని హృదులు హత్తుకొందును
ఏ లోకము తీసుకెళ్ళను
ఏ మహిమలు తెలియజేయను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment