కవితోత్సాహం
కలమును
చేతపట్టాలని ఉన్నది
కాగితాలను
పూరించాలని ఉన్నది
ఆలోచనలను
పారించాలని ఉన్నది
అద్భుతాలను
సృష్టించాలని ఉన్నది
రాయటమును
సాగించాలని ఉన్నది
రమణీయతను
కలిగించాలని ఉన్నది
అందాలను
చూపించాలని ఉన్నది
ఆనందాలను
అందించాలని ఉన్నది
పలుకులను
ప్రేల్చాలని ఉన్నది
తేనెబొట్లను
చల్లాలని ఉన్నది
భావాలను
బయటపెట్టాలని ఉన్నది
భ్రమలను
కల్పించాలని ఉన్నది
విషయాలను
వెల్లడించాలని ఉన్నది
హృదయాలను
హత్తుకోవాలని ఉన్నది
మదులను
మురిపించాలని ఉన్నది
హృదులను
హత్తుకోవాలని ఉన్నది
అక్షరజగమును
అలరించాలని ఉన్నది
పాఠకలోకమును
పరవశపరచాలని ఉన్నది
కవనప్రపంచమును
శాసించాలని ఉన్నది
సాహితీసామ్రాజ్యమును
పాలించాలని ఉన్నది
నీరు చల్లితే
చల్లబడతా
గాలి ఊదితే
ఆరిపోతా
ఊతమిస్తే
ఉర్రూతలూగిస్తా
ప్రేరేపిస్తే
రెచ్చిపోతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment