రండి..రారండి!


సాహిత్యసుధా లోకాన

పిలిచె మధురగీతం

అందాల అరుణోదయాన

వెలిగె సుకవితాదీపం


శుభ సంధ్యాకాలమున

పొడిచె చంద్రబింబం

తనువులను మురిపించగ

ముంచె మదులనుతాపం


ముత్యాలను

కాసేపు గుచ్చుకుందాం

రత్నమాలను

కాసేపు పేర్చుకుందాం


రంగులబొమ్మలతో

కాసేపు ఆడుకుందాం

సుందరశిల్పాలతో

కాసేపు పాడుకుందాం


చక్కని సొగసులను

కాసేపు దర్శించుదాం

అంతులేని ఆనందాలను

కాసేపు అందుకుందాం


తేనెచుక్కలను

కాసేపు చవిచూద్దాం

సుమసౌరభాలను

కాసేపు ఆఘ్రానిద్దాం


చిరునవ్వులను

కాసేపు కురిపించుదాం

లేతపువ్వులను

కాసేపు చల్లుకుందాం 


నవరసాలను

కాసేపు ఆస్వాదిద్దాం

హితవచనాలను

కాసేపు ఆలకిద్దాం


కోకిలకంఠాలను

కాసేపు తెరుద్దాం

నెమలి పింఛాలను

కాసేపు విప్పిద్దాం


కవితాజల్లులను

కాసేపు కురిపిద్దాం

సాహితీవరదను

కాసేపు పారిద్దాం


తనువులను

కాసేపు తట్టుదాం

మనసులను

కాసేపు ముట్టుదాం


అందాలజగతిలో

కాసేపు విహరిద్దాం

ఆనందలోకంలో

కాసేపు గడుపుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog