ప్రేమ ఉంటే.....
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ పువ్వులుంటాయి
సీతాకోకచిలుకలుంటాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ నవ్వులుంటాయి
వెలుగుతున్న మోములుంటాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ అందాలుంటాయి
ఆనందాలు వెల్లివిరుస్తుంటాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ చల్లదనముంటుంది
కడుగ కమ్మదనముంటుంది
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కద రంగులుంటాయి
కనులకు విందులుంటాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ తియ్యదనముంటుంది
నిండుగ కమ్మదనముంటుంది
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ మంచిమాటలుంటాయి
సమస్యలు అన్నీ సర్దుకుంటాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ చక్కని తోడుంటుంది
తనువులు తృప్తిని పొందుతాయి
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ హృదయముంటుంది
మానవత్వము పరిమళిస్తుంది
ఎక్కడ ప్రేమ ఉంటే
అక్కడ కాలం సర్దాగాసాగుతుంది
జీవితం సుఖమయమైపోతుంది
ప్రేమను
ఆహ్వానించు ఆస్వాదించు
ప్రేమను
పారించు ఈతకొట్టించు
ప్రేమను
పంచిపెట్టు పరవశపరచు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment