నోటిదూలవద్దురా!
నోటిదురద
వెళ్ళబుచ్చకురా
నాలుకదూల
తీర్చుకోకురా
అపనిందలు
వేయొద్దురా
అబాసుపాలు
కావొద్దురా
పుకార్లు
వ్యాపించకురా
గలీబోడు
అనిపించుకోకురా
అబద్ధాలు
చెప్పొద్దురా
విలువను
పోగొట్టుకోకురా
మాటలను
మార్చకురా
చెడ్డపేరు
మూటకట్టుకోకురా
వట్టిపలుకులు
వదరకురా
వదరుబోతువు
కాకురా
ద్వేషాలు
రగిలించకురా
కోపమును
ప్రదర్శించకురా
మాటవిలువను
ఎరుగుమురా
మంచితనమును
నిలుపుకొనుమురా
వాక్కులు
మురికిలాపారకూడదురా
నాలువు
జ్వాలలారగలకూడదురా
పెదవులు
నిప్పులుచిమ్మకూడదురా
పలుకులు
రాళ్ళనువిసరకూడదురా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment