ఒ కవీ!
నీ భాష, భావన
నిన్ను కవినిచేస్తాయి
మాకు నమ్మకన్నికలిగిస్తాయి
నీ సాహసం, భాద్యత
నిన్ను కవిగానిలబెడతాయి
మాకు మర్గదర్శకత్వంచేస్తాయి
నీ స్పందనలు, అనుభవాలు
నిన్ను విశేషవ్యక్తినిచేస్తాయి
మాకు మానసికానందాన్నిస్తాయి
నీ తేటపదాలు, తేనెపలుకులు
నిన్ను ఆకాశానికెత్తుతాయి
మాకు మాటలమర్మాలుతెలుపుతాయి
నీ రాతలు, చేష్టలు
నిన్ను చిరంజీవినిచేస్తాయి
మాకు అమృతరుచులందిస్తాయి
నీ లక్ష్యాలు, బాటలు
నిన్ను ముందుకునడిపిస్తాయి
మాకు అనుసరణీయమవుతాయి
నీ కలము, కాగితము
నిన్ను కదిలిస్తాయి
మాకు బేడీలేస్తాయి
నీ గళము, గానము
నిన్ను గాంధర్వుడినిచేస్తాయి
మాకు వీనులవిందునిస్తాయి
నీవే మాకు డశ, దిశ
నీవే మాకు ఆశ, ధ్యాస
నీవే మాకు అందము, ఆనందము
నీవే మాకు ఆశాజ్యోతివి
నీవే మాకు విఙ్ఞానగనివి
నీవే మాకు అక్షరలక్షాధికారివి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment