ఎలా చెప్పను?
చిలుకకు
చెప్పినట్లు చెప్పా
అర్ధంచేసుకోవటంలా
ఆచరించటంలా
చిరునవ్వులు
చిందుతూ చెప్పా
నచ్చటంలా
నమ్మటంలా
మంచిమాటలు
మధురంగా చెప్పా
ఆలకించటంలా
ఆస్వాదించటంలా
చక్కనివిషయాలు
సూటిగా చెప్పా
చెవికెక్కించుకోవటంలా
శ్రద్ధపెట్ట్తటంలా
బెత్తము
చేతబట్టుకొని చెప్పా
భయపడటంలా
బోధపడటంలా
కన్నీరు
కారుస్తూ చెప్పా
ఖాతరుచేయటంలా
కర్ణాలుతెరవటంలా
మూడుమాటల్లో
ముక్తసరిగా చెప్పా
మనసుపెట్టటంలా
మతలబుతెలుసుకోవటంలా
గుసగుసలు
చెవుల్లో ఊదా
గీ అనటంలా
బ్యా అనటంలా
ప్రియవాక్యాలు
ప్రేమతో చెప్పా
స్వీకరించటంలా
సంతసించటంలా
మమతానురాగాలు
ముచ్చటగా వ్యక్తపరిచా
మర్యాదివ్వటంలా
మనసుపెట్టటంలా
గుండ్లపల్లి రాజెంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment