ఏమి చేసేదీ..ఇంకేమిచేసేదీ?
ఏమి చేసేదీ... ఇంకేమి చేసేదీ?
ఏమి చేసేదీ నేనేమి చేసేదీ?
ఎలా చెప్పేదీ నేనెలా చెప్పేదీ?
ఏమి చేసేదీ... ఏమి చేసేదీ? ||ఏమి||
నెత్తీ నోరూ బాదుకున్నా
ఉలుకూ లేదూ పలుకూ లేదూ
కాళ్ళవేళ్ళూ పట్టుకున్నా
ముద్దూ లేదూ ముచ్చటా లేదూ ||ఏమి||
చీరా రవికా ఆశ చూపినా
కదలిక లేదూ మెదలిక లేదూ
పూలూ పండ్లూ ఇచ్చెదన్నా
తాకకున్నదీ తినకున్నదీ ||ఏమి||
సూటూ బూటూ వేసుకున్నా
నచ్చకున్నదీ మెచ్చకున్నదీ
మూటా ముల్లే సర్దుకున్నా
పట్టకున్నదీ మాట్లాడకున్నదీ ||ఏమి||
కమ్మలూ ఉంగరాలూ తెచ్చిచ్చినా
వద్దంటుందీ వారించుచున్నదీ
నగదూ నట్రా చేయిస్తానన్నా
ఒప్పుకోకున్నదీ తప్పుకుంటున్నదీ ||ఏమి||
ఫోనూ టీవీ కొంటానన్నా
వినకున్నదీ విసుగుకుంటున్నదీ
గుడులూ గోపురాలు చూపిస్తానన్నా
రాకున్నదీ రంకెలేస్తున్నదీ ||ఏమి||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment