ఊరకుంటే… 


ఏ ఆలోచన

తడుతుందో

ఏ చోటుకు 

తీసుకెళ్తుందో,


ఏ పనులు

చేయమంటుందో

ఏ ఘనకార్యం 

సాధించమంటుందో,


ఏ మాటలు 

పలుకమంటుందో

ఏ స్పందనలు 

ఆశిస్తుందో,


ఎక్కడకు

వెళ్దామంటుందో

ఏ ముచ్చటలు

చెప్పమంటుందో,


ఎవరిని

కలుద్దామంటుందో

ఎవరితో సంతోషం 

పంచుకుందామంటుందో,


ఏమి 

తినమంటుందో

ఏమి

త్రాగమంటుందో,


ఏమి 

చదవమంటుందో

ఏమి

నేర్చుకోమంటుందో.


ఏమి

ఆడదామంటుందో

ఏమి

పాడదామంటుందో,


ఎవరిని

పిలుద్దామంటుందో

ఏమేమి

చేద్దామంటుందో


ఏ అందాలు

చూడమంటుందో

ఏ ఆనందాలు

పొందమంటుందో,


ఓ మనసా! 

కవ్వించకే

కష్టపెట్టకే

కరుణించవే,


ఓ అంతరాత్మా 

మనసును అదుపులోపెట్టుకోవే

మాయామోహాలకు చిక్కకే

మానవత్వము మట్టుపెట్టకే.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog