తెలుగు ధారలు
తెలుగు వెలుగుతుంటే
మది మెరిసిపోతుంది
తెలుగు కనబడుతుంటే
హృది ఆనందిస్తుంది
తెలుగు తడుతుంటే
తనువు పరవశిస్తుంది
తెలుగు చదువుతుంటే
మనసు పులకరిస్తుంది
తెలుగు పలుకుతుంటే
తీపి దొర్లుతుంది
తెలుగు వింటుంటే
నాడులు నర్తిస్తాయి
తెలుగు పారుతుంటే
తృష్ణ తీరుతుంది
తెలుగు వీస్తుంటే
మేను మురిసిపోతుంది
తెలుగు మొగ్గలుతొడిగితే
కళ్ళు కళకళలాడుతాయి
తెలుగు విచ్చుకుంటుంటే
ఉల్లం ఉప్పొంగిపోతుంది
తెలుగు పరిమళిస్తుంటే
ప్రాణం లేచివస్తుంది
తెలుగు వ్యాపిస్తుంటే
ఉల్లం ఉరుకులేస్తుంది
తెలుగు రాస్తుంటే
కలం పరుగెత్తుతుంది
తెలుగు చెబుతుంటే
కాయం కుషీపడుతుంది
తెలుగు కురుస్తుంటే
తలపులు తట్టుతాయి
తెలుగు పొంగుతుంటే
కవితలు ప్రవహిస్తాయి
తెలుగు నాలుకలు
అమృత స్థావరాలు
తెలుగు పలుకులు
లేత కొబ్బరిపలుకులు
తెలుగు ఉజ్వలజ్యోతి
శాశ్వత ప్రేరణి
తెలుగు దివ్యఔషధి
ఙ్ఞాన ప్రవర్ధని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment