నోటిముత్యాలు
నోరు తెరిస్తే –
నవరత్నాలు రాలాలి,
పలుకులు విసిరితే –
తేనెచుక్కలు చిందాలి.
గొంతు విప్పితే –
నవరసాలు కురవాలి,
పాట పాడితే –
బండరాళ్ళూ కరగాలి.
మాటలు కలిస్తే –
మనసులు మురవాలి,
అధరాలు కదిపితే –
అమృతం పొంగిపొర్లాలి.
శబ్దాలు వదిలితే –
చెవులు శ్రావ్యతపొందాలి,
ముక్కు మీద వేలేస్తే –
మూతులు ముడుచుకుపోవాలి.
గట్టిగా పలికితే –
భయంతో వణికిపోవాలి,
శంఖం మోగిస్తే –
సమరానికి సిద్ధమవ్వాలి.
మధుర గళాలే
హృదులకు ఆనందాలు,
రసాత్మక వాక్కులే -
కవులకు అలంకారాలు.
గుండ్లపల్లి రాజేంరప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment