జనారణ్యంలో.....
పాములు ప్రాకుతున్నాయి
పడగలు విప్పుతున్నాయి
విషం క్రక్కుతున్నాయి
కరచి కాట్లువేస్తున్నాయి
తేళ్ళు తిరుగుతున్నాయి
తోకలు ఆడిస్తున్నాయి
తిన్నగా కుట్టుతున్నాయి
భాధలు పెడుతున్నాయి
గాడిదలు ఓండ్రిస్తున్నాయి
కాళ్ళతో తన్నుతున్నాయి
క్రిందకు పడదోస్తున్నాయి
గాయాలపాలు చేస్తున్నాయి
నక్కలు ఊళలేస్తున్నాయి
నాటకాలు ఆడుతున్నాయి
జిత్తులు పన్నుతున్నాయి
మోసాలకు గురిచేస్తున్నాయి
గబ్బిలాలు గమనిస్తున్నాయి
చెట్లకు వ్రేలాడుతున్నాయి
చీకట్లో చరిస్తున్నాయి
చిక్కినివి దొచుకుంటున్నాయి
దుష్టులు తిరుగుతున్నారు
సమయంకోసం చూస్తున్నారు
కాచుకొని ఉన్నారు
కబళించటానికి సిద్ధంగున్నారు
కొందరు తియ్యగాపలుకుతున్నారు
మాటలతో నమ్మిస్తున్నారు
సమయం చూస్తున్నారు
నట్లేట్లో ముంచుతున్నారు
కొంతమంది నటిస్తున్నారు
బయటకు బాగాకనపడుతున్నారు
లోపల నిజరూపందాచుకుంటున్నారు
అనుకూలించినపుడు అవస్థలపాలుజేస్తున్నారు
కొలదిదుర్మార్గులు గోముఖంకప్పుకుంటున్నారు
ప్రక్కకు చేరుతున్నారు
ప్రేమను చాటుతున్నారు
పిమ్మట పులులైభక్షిస్తున్నారు
తెల్లనివన్నీ పాలనుకోవద్దు
నల్లనివన్నీ నీళ్ళనుకోవద్దు
అంతరరూపాలను ఆదమరచవద్దు
బాహ్యసౌందర్యాలకు బలికావద్దు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment