కవనవిన్యాసాలు


అక్షరాలను

కుప్పలుగాపోసాడు

పదాలను

పంక్తులుగాపేర్చాడు


చేతుల్లోకి

చిక్కినంతతీసుకోమన్నాడు

మాటల్లోకి

వీలైనంతమార్చుకోమన్నాడు


అర్ధమైతే

ఆనందించమన్నాదు

అంతరంగంలో

నిలుపుకోమన్నాడు


నచ్చితే

నోరారామెచ్చుకోమన్నాడు

నలుగురితో

నిరభ్యరంతరంగాపంచుకోమన్నాడు


హృదిలో

పదిలపరచుకోమన్నాడు

మదిలో

మెరుపులుమెరిపించమన్నాడు


వెలుగులు

విరివిగాచిమ్మమన్నాడు

పరిమళాలు

పరిసరాలచల్లమన్నాడు


తేనెచుక్కలు

రుచిచూడమన్నాడు

తియ్యదనమును

ఆస్వాదించమన్నాడు


చెరకురసము

కడుపునిండాత్రాగమన్నాడు

చక్కదనములు

కళ్ళనిండాదాచుకోమన్నాడు


సాహితీచైతన్యము

ప్రదర్శించమన్నాడు

కవనవిన్యాసాలు

గమనించమన్నాడు


కవితాసామ్రాజ్యమును

బలపరచమన్నాడు

కవిసార్వభౌములకు

పట్టాభిషేకంచేయమన్నాడు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  

Comments

Popular posts from this blog