అద్భుతంగా జరిగిన కాలిఫోర్నియా వీక్షణం 159వ అంతర్జాల సాహితీ సమావేశం
**********************************************************
నేడు 15-11-25వ తేదీ ఉదయం 6-30 గంటలకు నిర్వాహకురాలు డాక్టర్ గీతామాధవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైనది. ముఖ్య అతిథి శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు.
శ్రీ కోదండరామయ్యగారు తెలుగుభాషావ్యాప్టికై అనన్యమైన కృషి చేస్తున్నారని, వారు తెలుగు భాషను రక్షించుకోవడంపై అనేక పుస్తకాలు వ్రాసారు, అనేక వేదికలపై ప్రసంగించారని చెప్పారు. తెలుగుభాషను రక్షించుకోవాలంటే పాఠశాలవిద్య ప్రాథమిక స్థాయినుండి ఉన్నత స్థాయి సాంకేతిక విద్యవరకూ తెలుగు మాధ్యమంలోనే ఉండాలన్నారు. ముందుగా తలిదండ్రులు వారి పిల్లలకు తెలుగు భాషే నేర్పాలన్నారు. తెలుగు భాషలో మాట్లాడడం అవమానంగా భావించే దుస్థితి పోవాలన్నారు. జనంలో కదలిక రావాలని, ఉద్యమం చేయాలని చెప్పారు. వారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రసంగంపై గీతా మాధవి గారు, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు స్పందించారు
పిదప శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారు కవిసమ్మేళనం నిర్వహించారు. మొదటిగా డా.గీతామాదవి గారు " క్రిమి సంహారం" అనే శీర్షికతో చక్కని కవితను గోదావరి యాసలో చదివి అందరినీ ఆకట్టుకున్నారు. తరువాత ప్రముఖ కవి కొండ్రెడ్డి నాగిరెడ్డి గారు తన కవితను పాటగా పాడి అందరినీ అలరించారు. శ్రీ గంటా మనోహర రెడ్డిగారు ఘంటారావం మినీ కవితలను భావస్పోరకంగా చదివారు. శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు జననిమించిన దైవం తెలుగు మించిన భాష ఏమిటంటూ తెలుగుభాషా ప్రాశస్త్యాన్ని తెలిపారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఇటీవల స్వర్గస్తులైన లోకకవి అందేశ్రీ గారికి అక్షర నివాళులు సమర్పించారు.
శ్రీ కందుకూరి శ్రీరాములు గారు బాలశిక్ష అనే కవితలో అమ్మంటే అర్థం తెలియని పిల్లలకు తెలుగులో శిక్షణ ఇవ్వాలి అన్నారు. డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారు ఈ అమ్మ నాకొద్దు అనే మంచి కవితను చదివారు. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు అక్షరమే ఆయుధం అనే కవితను చదివారు. శ్రీమతి కొడాటి అరుణ గారు కమ్మనైన తెలుగుభాష మనది అంటూ మంచి కవితను చదివారు. కావలి కవి ప్రసాదరావు రామాయణం గారు నేను అనే శీర్షికతో అసంతృప్తి నైరాశ్యం,దీర్ఘనైరస్యం ఆగ్రహం, తీవ్ర ఆగ్రహం, అంగారం, అణుబాంబు అంటూ భావభరిత కవితను చదివారు. ప్రొద్దటూరు కవయిత్రి శ్రీమతి అవధానం అమృతవల్లి గారు సాకారం చేస్తూ అని చదివిన కవిత అమృతంలా ఉంది. డా.బృందగారు పుస్తకం నా ప్రియ నేస్తం అంటూ గానం చేసి అందరినీ ముగ్ధులను చేశారు.
ఉప్పలపాటి వెంకటరత్నంగారు "అదుంటే చాలు"అనే కవితను చరవాణిపై చదివి అందరినీ అలరించారు. డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు తల్లి ప్రేమపై పద్యాలు చక్కగా చదివారు. శ్రీ చేపూరి జెవి కుమార్ గారు " కవిసమ్మేళన ఋణం", అంటూ చదివిన కవిత అద్భుతంగా ఉంది. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు విద్వత్తులో విద్యుత్తు అనే కవిత చాలా బావుంది. శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు "భాష "అనే శీర్షికతో చదివిన కవిత అద్భుతంగా ఉన్నది. డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు చిట్ ఫండ్ చేష్టలు అంటూ చదివిన కవిత హాస్యాన్ని చిందించింది. అరుణ కీర్తి పతాక గారు అభ్యున్నతికి "పోటీ" అవసరమంటూ కవిత చదివారు. న్యాయవాది శ్రీమతి లలితా చండీ గారు "ఆమె" అనే కవితతో అందరినీ ఆకట్టుకున్నారు.
శ్రీమతి బుక్కపట్నం రమాదేవిగారు "తెలుగుభాష" సౌందర్యం గురించి కవితను చదివారు. శ్రీమతి అరుణ కీర్తి పతాకరెడ్డి గారు మంచి గాయకురాలు. శ్రావ్యంగా ఒక గజల్ అద్భుతంగా పాడి వినిపించారు. డా.విజయలక్ష్మి మల్కని గారి మల్లె నా తేనియ కవిత అందరినీ ఆకట్టుకుంది. మొండ్రేటి సత్యవీణ గారి పెద్ద దిక్కుకు దిక్కెవరు అనే శీర్షికతో వృద్ధుల గురించి మంచి కవిత చదివారు. శ్రీ బోగేల ఉమా మహేశ్వరరావుగారు తెలుగు మహా కవులందరినీ ఉటంకిస్తూ చక్కని తెలుగు భాషా కవితలను చదివారు. శ్రీమతి నెల్లూరు ఇందిర ాగారు తన కవిత "సుస్థిర అక్షరం" అనే మంచి కవితను చదివి అలరించారు. యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డిగారు దివ్వెల దీపావళి కవిత చదువుతూ చిన్నారులకు పురాణ గాధలు చెప్పాలన్నారు. శ్రీమతి మాణిక్యలక్ష్మీ గారు ధర్మో రక్షతి అనే కవితను చదువగా, శ్రీమతి కొలచన శ్రీసుధ గారు పూర్ణ సింధువు అనే కవితను బాగా చదివారు. శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారు "మట్టిలో మాణిక్యాలు" అనే కవితను చదువుతూ మన తెలుగుభాషను చులకన చేయవద్దని చెప్పారు. చివరగా వీక్షణం భారత ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు కవిత్వం ఎలా ఉండాలి అని చదివిన తీరు సభకు తలమానికంగా నిలిచింది అందరి మన్ననలను పొందింది.
గీతా మాధవి గారు వచ్చే నెల 17వ తేదీ రవీంద్రభారతిలో ప్రత్యక్షంగా సభ జరుగుతుందని అపుడు పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని తీపి కబురు అందించారు. డాక్టర్ గీతా మాధవిగారి వందన సమర్పణతో ఉదయం 10 గం కు సభ ముగిసింది. సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా జరిగిందని పాల్గొన్న కవులు సంతోషం వ్యక్తపరిచారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ & గీతా మాధవి, నిర్వాహకులు, వీక్షణం గవాక్షం, కాలిఫోర్నియా.
Comments
Post a Comment