చూపుల స్రవంతి
కంటి చూపే నిశ్శబ్ద మంత్రం,
మనసుల తడిపే భావ తంత్రం.
చక్కని చూపు చిందించు తేనియ,
చూడగానే కదిలించు గుండెకాయ.
టక్కరి చూపు దహించు ధగధగ,
చెంపలను మెరిపించు మిళమిళ.
సూటి చూపు గుచ్చు బాణాలు,
నిశ్శబ్దంలో వినిపించు గాధాలు.
పక్క చూపు పలుకులకంటే లోతు,
మాటలకందని భావాలకు సరితంతు.
చిలిపి చూపు చిరునవ్వుల దాచు,
కొంటె చూపు హృదయాల్ని ఆచు.
బెరుకు చూపు భ్రమల చాటునుండు,
దొంగ చూపు కోరికల మాటునుండు.
వంకర చూపు వ్యంగ్య గీతమౌ,
మాటలకతీతమై మౌన శీతలమై.
తొలి చూపే ప్రేమ పుట్టుకకు కారణం,
ఆ చూపే హృదయానికి కొత్త సుగంధం.
చూపులే లోకం, చూపులే భావం —
వాటిలో దాగి ఉన్నదే జీవన రాగం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment