చేతల్లో...


చేతల్లో

చేవ ఉండాలి

అందరూ

మెచ్చేలా ఉండాలి


చేతల్లో

సేవ ఉండాలి

స్వార్ధాన్ని

తగ్గించుకోవాలి


చేతల్లో

ప్రతిభ ఉండాలి

నలుగురూ

గుర్తించేలా ఉండాలి


చేతల్లో

పట్టుదల ఉండాలి

అనుకున్నది

సాధించేలా ఉండాలి


చేతల్లో

మంచితనం ఉండాలి

సమాజానికి

మేలుచేసేలా ఉండాలి


చేతల్లో

లక్ష్యం ఉండాలి

విజయతీరాలు 

చేరుకొనేలా సాగాలి


చేతల్లో

నమ్మకం ఉండాలి

మనసులోని

సందేహాలు తొలగాలి


చేతల్లో

నిజాయితీ చూపాలి

మాటలకు

కట్టుబడి ఉండాలి


చేతల్లో

నవ్యత ఉండాలి

భవితపై

దృష్టి సారించాలి


చేతల్లో

క్రమశిక్షణ ఉండాలి

జనబాహుళ్యంలో

రాణింపు పొందాలి


చేతల్లో

నిబద్ధత ఉండాలి

జనహృదయాల్లో

దీపాలు వెలిగించాలి


చేతల్లో

సులక్షణాలు ఉండాలి

జీవితాన్ని

సార్ధకం చేసుకోవాలి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog