కవితాకవ్వింపులు - కవిత్వరూపాలు


కవిత్వం

కళ్ళకుకనిపించాలి

పెదాలపలికించాలి

వీనులకువినిపించాలి

హృదులనుకట్టిపడేయాలి


కవిత్వం

తలల్లోమొలకెత్తాలి

ఆకాశంవైపెదగాలి

పలుపువ్వులపూయాలి

పెక్కుఫలములనివ్వాలి


కవిత్వం

రుచిగావండాలి

శుచిగావడ్డించాలి

వడిగాతినిపించాలి

తిన్నగాతృప్తిపరచాలి


కవిత్వం

సుమధురంగుండాలి

సుగంధాలుచల్లాలి

వెన్నెలనుచిందాలి

వెలుగులుచిమ్మాలి


కవిత్వం

నిండుగుండాలి

నాణ్యముగుండాలి

నిత్యమైనిలిచిపోవాలి

నవ్యమైనోర్లలోనానాలి


కవిత్వం

ప్రాయంలాపరుగెత్తాలి

పాలులాపొంగిపొర్లాలి

నదిలాప్రవహించాలి

మదులామురిపించాలి


కవిత్వం

ఆటలాడించాలి

పాటలుపాడించాలి

మారుమ్రోగిపోవాలి

మయిమరిపించాలి


కవిత్వం

అందంగుండాలి

ఆనందమివ్వాలి

అంటుకొనిపోవాలి

అంతరంగాలుతట్టాలి


కవిత్వం

రంగులహంగులుచూపాలి

అద్భుతశిల్పాలుచెక్కాలి

చక్కనిబొమ్మలుగీయాలి

సుందరదృశ్యాలువర్ణించాలి


కవిత్వం

పువ్వులుపుయ్యాలి

వికసించివెలగాలి

తేనెచుక్కలనుచల్లాలి

హృదులనుదోచుకోవాలి


కవిత్వం

అనుభూతులుచెప్పాలి

ఆస్వాదింపజేయాలి

సందేశాలనివ్వాలి

సందేహాలుతీర్చాలి 


కవిత్వం

వానజల్లులాకురవాలి

వరదజలంలాపారాలి

ఒడలనుమత్తెక్కించాలి

వేడుకలలోతేలించాలి 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog