కడుపే కైలాసం
కడుపు వస్తే
అమ్మానాన్నల అదృష్టం
కడుపు పండితే
కుటుంబానికి సంతోషం
కడుపు ఎండితే
కాయానికి కష్టం
కడుపు మండితే
క్రక్కుతుంది కోపం
కడుపు కొడితే
తగులునులే పాపం
కడుపు నింపితే
వచ్చునులే పుణ్యం
కడుపు చించుకుంటే
కాళ్ళమీద కంపడం
కడుపు కొట్టుకుంటే
కలుగునులే విషాదం
కడుపు పారితే
వంటికి దుఃఖం
కడుపు అరగగపోతే
దేహానికి అరిష్టం
కడుపు నిమిరితే
చిగురిస్తుంది ఆనందం
కడుపు తిప్పితే
శరీరానికి వ్యాయామం
కడుపు చేస్తే
శక్తికి నిదర్శనం
కడుపు తంతే
మానవతకే కళంకం
కడుపు బానెడయితే
రోగాలకు మూలం
కడుపు కట్టుకుంటే
శోషకు ఆహ్వానం
కడుపు కూటికే
కోటివిద్యలు నేర్వటం
కడుపు ప్రీతికే
కష్టాలను భరించటం
కడుపే కైలాసం
ఇల్లే వైకుంఠం
కడుపే సర్వం
పోషణే ధర్మం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment