అక్షరవెలుగులు


అక్షరాలు

వెలిగించాలని,

అనునిత్యము

ఆరాటపడుతున్నా.


దీపాలు

వెలిగించాలని,

తిమిరాన్నితోలాలని

పోరాటంచేస్తున్నా.


కళ్ళను

వెలిగించాలని,

కమ్మనిదృశ్యాలు

కనబరస్తున్నా.


మోములు

వెలిగించాలని,

చిరునవ్వులు

చిందిస్తున్నా.


లోకమును

వెలిగించాలని,

రవినై

కిరణాలుచిమ్ముతున్నా.


రాత్రులను

వెలిగించాలని,

శశినై

వెన్నెలనుచల్లుతున్నా.


నక్షత్రపధము

వెలిగించాలని,

తారకలను

తళతళలాడిస్తున్నా.


కొవ్వొత్తులు

వెలిగించాలని,

కటికచీకట్లను

తరమలానియత్నిస్తున్నా.


జీవితాలు

వెలిగించాలని,

సమాజానికి

హితోపదేశాలుచేస్తున్నా.


మదులు

వెలిగించాలని,

మధురకవితలను

మంచిగాకూర్చుతున్నా.


బాణసంచా

వెలిగిస్తున్నా,

మ్రోగిస్తున్నా

లక్ష్మీప్రసన్నంకోసం.


కవితలను

వెలిగిస్తున్నా,

చదివిస్తున్నా

వాగ్దేవికటాక్షంకోసం.


-- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog