ఈ లోకంలో.....
చిరునవ్వులు చిందిస్తున్న
చిద్విలాసులు ఎందరో
వెలుగులు వెదజల్లుతున్న
వికాసవదనులు ఎందరో ||చిరు||
తేనెపలుకులు చల్లుతున్న
తెలివైనవారు ఎందరో
అమృతజల్లులు కురిపిస్తున్న
అనుభవఙ్ఞులు ఎందరో
అందాలు చూపుతున్న
అపురూపులు ఎందరో
ఆనందాలు పంచుతున్న
అత్మీయులు ఎందరో ||చిరు||
సుగుణాలు నేర్పుతున్న
సద్గురువులు ఎందరో
సత్కర్మలు చేయిస్తున్న
సుశీలులు ఎందరో
సద్బాటను నడిపిస్తున్న
సౌమ్యులు ఎందరో
సమస్యలు తొలగిస్తున్న
శుభకరులు ఎందరో ||చిరు||
సలహాలు అందిస్తున్న
స్నేహితులు ఎందరో
సత్కారాలు చేస్తున్న
సుజనులు ఎందరో
మెప్పులు గుప్పిస్తున్న
మేధావులు ఎందరో
గొప్పలు వ్యాపిస్తున్న
ఘనులు ఎందరో ||చిరు||
వందనాలు వందనాలు
పెద్దలకు వందనాలు
దీవెనలు దీవెనలు
చిన్నవారికి దీవెనలు
ధన్యవాదాలు ధన్యవాదాలు
ప్రోత్సాహకులకు ధన్యవాదాలు
ప్రణామాలు ప్రణామాలు
ప్రముఖపండితులకు ప్రణామాలు ||చిరు||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment