కొఱతల చిట్టా


రవి లేకపోతే

భూగోళానికి వెలితి

శశి లేకపోతే

గగనానికి వెలితి


అందం లేకపోతే

దేహానికి వెలితి

ఆనందం లేకపోతే

వదనానికి వెలితి


మాటలు లేకపోతే

నోటికి వెలితి

కూడు లేకపోతే

కడుపుకు వెలితి


భార్య లేకపోతే

భర్తకు వెలితి

మొగుడు లేకపోతే

పెళ్ళానికి వెలితి


ప్రేమ లేకపోతే

హృదులకు వెలితి

డబ్బు లేకపోతే

మనుజులకు వెలితి


అంగం లేకపోతే

శరీరానికి వెలితి

వెలుగు లేకపోతే

జీవితానికి వెలితి


హారం లేకపోతే

మెడకు వెలితి

కేశాలు లేకపోతే

తలలకు వెలితి


కంకణాలు లేకపోతే

చేతులకు వెలితి

కదలికలు లేకపోతే

కాళ్ళకి వెలితి


బొట్టు లేకపోతే

నుదురుకు వెలితి

బట్టలు లేకపోతే

మనుజులకు వెలితి


వెలితిలేని బ్రతుకే

జీవనలక్ష్యం కావాలి

గలితీలేని పనులే

జనులకార్యం కావాలి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog