🌺 తెలుగు వైభవం 🌺
తెలుగు — మందార మకరందం,
మాతృమూర్తి నేర్పిన మధురనాదం.
వాగ్ధేవి నోటిలో వెలసిన అజంతం,
వెన్నెల ప్రసరించిన గానామృతం.
కళల కలువ తోటలో తేనెతుట్టె,
కవిత్వం కుసుమించె ప్రతి అక్షరమూ.
త్యాగరాజు కీర్తనల్లో తారల కాంతి,
గురజాడ వాడుకపదాల్లో జనరంజని.
తెలుగు నేలపై పుట్టిన పండితులు,
పదసముద్రం లోతులు కొలిచినవారు.
శ్రీనాథుడి శ్లేషముల సీమలో ముత్యాలు,
వేమన చెప్పిన ఆటవెలదులలో సూక్తులు.
తెలుగు తల్లి ఒడిలో పుట్టినవారెవరైనా —
అక్షరాల గర్వం, భాషా సౌభాగ్యం అనుభవిస్తారు.
మనసు నిండా మమకారమై తేలే —
అమృతభాషే, మన తెలుగుతల్లి భాష!
తెలుగును - మన ప్రాంతంలో మెరిపించుదాం
పర రాష్ట్రాలలో పలువురిచే పలికించుదాం
వివిధ దేశాల్లో విరివిగా వ్యాపించుదాం
తెలుగుతల్లి ఋణం తప్పకుండా తీర్చుకుందాం
✍ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ✍
Comments
Post a Comment