నా విశ్రాంత జీవితగమనం
వాడిపోబోయే నాకు వరాలెందుకు,
వాగ్దానాలెందుకు విలాసాలెందుకు,
విరమించకుండా వాగ్దేవినిపూజిస్తా,
విషయాన్వేషణచేస్తా వాక్యాలనురసాత్మకంచేస్తా...
పండిపోబోయే నాకు పరుగులెందుకు,
పాటులెందుకు పాకులాటలెందుకు,
పలుకులమ్మనితలుస్తా పదాలుపేరుస్తా,
పెదాలువిప్పుతా పలుకులుచిమ్ముతా...
రాలిపోబోయే నాకు రత్నాలరాశులెందుకు,
రసాభసాలెందుకు రాగద్వేషాలెందుకు,
రయ్యిరయ్యిమంటూ రచనలు సాగిస్తా,
రమ్యతచేకూరుస్తా రసాస్వాదనచేయిస్తా...
కూలిపోబోయే నాకు కారుకూతలెందుకు,
కాసులవేటెందుకు కష్టపడటమెందుకు,
కదలకుండామెదలకుండా కలంపడతా,
కాగితాలునింపుతా కవితలుకూరుస్తా...
నా విశ్రాంతజీవితం-ఆలోచనాత్మకం,
అక్షరాలసేద్యం ఆవిష్కరణలపర్వం ,
అందాలమయం ఆనందాలభరితం,
ఆసాంతం ఆప్యాయం అవిశ్రాంతం...
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment