ఓ మంచిమనిషీ!
జీవితాన్ని తెలుసుకో
పుట్టుకని తరించుకో
కాలాన్ని గౌరవించుకో
కష్టాలని భరించుకో
ప్రాణాన్ని పులకరించుకో
మానాన్ని కాపాడుకో
మదులని దోచుకో
హృదులని పట్టుకో
భాగ్యాల్ని కూర్చుకో
భోగాల్ని ప్రాప్తించుకో
ప్రేమల్ని పంచుకో
బాంధవ్యాలని పెంచుకో
దేవుడిని తలచుకో
పూజలుని చేసుకో
వరాలని కోరుకో
కోర్కెలని తీర్చుకో
సుకర్మలని చేసుకో
సత్కీర్తిని అందుకో
మానవతని చాటుకో
మనిషినని నిరూపించుకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment