సూక్తాష్టకం
రెక్కాడితేగాని డొక్కాడదు-
కడుపునిండదు నిదురపట్టదు.
గాలాడితేగాని శ్వాసందదు -
గుండెకొట్టుకోదు ప్రాణంనిలువదు.
అనుభవిస్తేగాని అవగతంకాదు-
విశ్వాసంకలగదు ఆనందందొరకదు.
కళ్ళతోచూస్తేగాని నిజాలుతెలియవు-
నమ్మబుద్ధిపుట్టదు రంగుబయటపడదు.
సాధనచేస్తేగాని పనులుసమకూరవు -
ఫలితాలుచిక్కవు ప్రతిభవెల్లడికాదు.
మనసువిప్పితేగాని నిజాలుతెలియవు -
అంతరంగంవెలువడదు విలువబహిర్గతంకాదు.
అడుగులేస్తేగాని ముందుకుజరగము -
పయనంసాగదు గమ్యముచేరము.
కలంకదిలితేగాని కాగితంమాట్లాడదు -
కవితాపుష్పంపూయదు భావరాగంవెలుగొందదు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment