ఓ కవీశ్వరా!
కవన పీఠము ఎక్కరా
కీర్తి కిరీటము దాల్చరా
మంచి మాటలు చెప్పరా
శ్రోతల మదులు దోచరా
తేనె పలుకులు చిందరా
కవితా ఆసక్తి పెంచరా
అమృత జల్లులు చల్లరా
జనుల నోర్లనందు నానరా
చక్కగా అక్షరాలు అల్లరా
ప్రాసలతో పదాలు పేర్చరా
ఉల్లాలలో ఊహలు ఊరించరా
బాగుగా భావాలు పారించరా
జగాన వెలుగులు చిమ్మరా
సుమ సౌరభాలు వెదజల్లరా
అంద చందాలు చూపరా
ఆనంద పరవశాలు కలిగించరా
నవ రసాలు అందించరా
ప్రజా నాడిని పట్టరా
మధుర గళము విప్పరా
వీనులకు విందు ఇవ్వరా
కవన సేద్యము సాగించరా
కవితా పంటలు పండించరా
సాహితీ లోకమును ఏలరా
కవన రాజ్యమును పాలించరా
అక్షరదీపమై అంధకారము తొలగించరా
సత్యస్వరమై లోకహితమును బోధించరా
నీకలమే మానడకకు మార్గదర్శకము కావాలిరా
నీకవితలే కాలమునకు సాక్ష్యముగా నిలవాలిరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment