పద్య మాధుర్యాలతో, కవితల సౌరభాలతో మురిపించిన వీక్షణం 161వ సాహితీ అంతర్జాల సమావేశం

***************************************************************


నేడు 17-01-26 తేదీ ఉదయాన కాలిఫోర్నియా వీక్షణం గవాక్షం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి అధ్యక్షతన 161వ సభ ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా జరిగింది.గీతా మాధవి గారు మొదట కవులకు ఆహ్వానం పలికారు. ముఖ్య అతిధి, పద్యకవి డాక్టర్ రాధశ్రీ గారిని పరిచయం చేసి పద్య మాధుర్యాలపై ప్రసంగించమని కోరారు. డాక్టర్ రాధశ్రీ గారు పద్య ప్రవాహంతో సభికులను ముంచెత్తారు. నన్నయ, తిక్కన్న, ఎర్రన, పోతన మొదలగు కవుల పద్యాలను గంగా ప్రవాహంలా పారించి శ్రోతలందరికి తెలుగు పద్యాల విశిష్టతను చాటేలా ప్రసంగించారు. సభికులను చెరకు రసం త్రాగించారు, బందరు లడ్డులు అందించారు, పూత రేకులు పంచిపెట్టారు, కాకినాడ కాజాల రుచి చూపించారు, రసగుల్లాలను గుటకేయించారు. కొత్తూర్ వెంకట్, శ్యామలాదేవి రాధశ్రీ గారు పద్యాల విశిష్టతలు తెలియజేసారని, మదులు దోచుకున్నారని కొనియాడారు.  


తదుపరి, కవిసమ్మేళనాన్ని వీక్షణం భారత ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మరియు కవిసమ్మేళన సామ్రాట్ రాధాకుసుమ గారు చక్కగా నిర్వహించారు. మొదట గీతా మాధవి కొండవాలు వాన పూలతీగె అని కవితను భావాత్మకంగా శ్రావ్యంగా వినిపించి శుభారంభాన్ని ఇచ్చారు. తర్వాత కొత్తుర్ వెంకట్ సంక్రాంతి పండుగ ధాన్యాలపై రెందు పద్యాలు వినిపించారు. కవి విమర్శకుడు నాళేశ్వరం శంకరం గారు డాలరు పండుగ, ప్రముఖకవి సాధనాల వేంకటస్వామినాయుడు హేమంత హేళ, ప్రముఖ కవి గంటా మనోహరరెడ్డి ఘంటారావాలు,  నంది అవార్డు గ్రహీత మైసా ఎర్రన్న ప్రకృతిపై, అరుణ కీర్తి పతాకరెడ్డి సావిత్రిభాయి పూలెపై, కావలి కవి రామాయణం ప్రసాదరావు వధ్యశిలపై, ప్రఖ్యాత వ్యాఖ్యాత వుండవల్లి సుజాత సుకుడే తెలిపెనటగా అనే పాటను, కవయిత్రి కోదాటి అరుణ త్యాగయ్యపై, గుండు మల్లికార్జునరావు కోయిలపై, అర్వా రవీంద్రబాబు శిలానివ్వే శిల్పీనివేఎ అనే పాటను, ప్రేమ మధురమే కానీ వికటిస్తే అనే కవితను, చేపూరి కుమార్ తమాషాగా ఒక ప్రత్యేక కవితను, న్యాయవాది లలిత చండి అనుకున్నవన్నీ జరుగవు అనే కవితను, కట్టా శ్యామలాదేవి హేమంతపు అందాలు కవితను, వరంగల్లు కవి బిటవరం శ్రీమన్నారాయణ మనసు సుగంధ పరిమళం అనే కవితను, ప్రముఖ కవయిత్రి అవధానం అమృతవల్లి జీవన సంక్రమంలో అనే కవితను, బలుసాని వనజ కాంతులు నింపే సంక్రాంతి అనే కవితను, ఒంగోలు కవి ఉప్పలపాటి వెంకట రత్నం అనుకోలేదు అనే కవితను, జోరు పవిత్ర క్రిష్ణ మోము నుండి మాటవస్తే అనే కవితను, ఆనం ఆశ్రితారెడ్డి ముగింపు ఎప్పుడూ అనే కవితను, సినీ గేయ రచయిత్రి బుక్కపట్నం రమాదేవి పరామర్శ అనే కవితను  చదివి అందరినీ అలరించారు. కుసుమధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధాకుసుమ వీధిబాలలు అనే కవితను చక్కగా ఆలపించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ లేవరా తెలుగోడా అంటూ ప్రాసయుక్త గేయగేయకవితను ఉద్వేగంగా పాడి శ్రోతలందరినీ ఉత్సాహపరిచారు.


పిమ్మట కీర్తి శేషులు కవి గుంటూరు శెషేంద్ర శర్మ భార్య రాజకుమరి ఇందిర దేవి ధనరాజగిర్ మరణానికి సంతాపం ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం వహించారు. 


కార్యక్రమంలో చక్కగా ప్రసంగించిన రాధాశ్రీ గారికి, కవిసమ్మేళనంలో పాల్గొని మంచి కవితలను వినిపించిన కవులకు సభను విజవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్పి డాక్టర్ గీతా మాధవి గారు సమావేశాన్ని ముగించారు. 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతీయ ప్రతినిధి.



Comments

Popular posts from this blog