🌟 గెలవాలి..గెలవాలి.. 🌟
ఆటల్లో గెలవాలి,
ఆత్మవిశ్వాసాన్ని కవచం చేసుకుని
శ్రమిస్తూ, చమట కారుస్తూ
మైదానంలో మెరుపులు చిందించాలి.
పాటల్లో గెలవాలి,
స్వరాల సవ్వడితో
మనసుల్ని దోచుకుని
హృదయాల్లో హరివిల్లులు పూయించాలి.
మాటల్లో గెలవాలి,
మాధుర్యమే మంత్రంగా,
మంచితనమే మార్గంగా
వాక్యాలతో విజయాన్ని ముద్దాడాలి.
వేటలో గెలవాలి,
లక్ష్యాన్ని కళ్లలో నిలిపి,
ఓర్పును ఒడిలో పెట్టుకుని
సాధనతో సాఫల్యం అందుకోవాలి.
చేతల్లో గెలవాలి,
కష్టాన్ని కౌగిలించుకుని,
కళగా మలచిన పనితో
సమాజానికి నైపుణ్యం చూపాలి.
రాతల్లో గెలవాలి,
అక్షరాలకు ప్రాణం పోసి,
భావాలకు రెక్కలు కట్టి
సాహిత్యంలో చిరంజీవిగా నిలవాలి.
ప్రేమలో గెలవాలి,
అహంకారాన్ని ఓడించి,
అర్పణలో ఆనందం చూసి
రెండు హృదయాల్ని ఒక్కటిచేయాలి.
పోటీల్లో గెలవాలి,
ఈర్ష్యను పక్కన పెట్టి,
ప్రతిభతో ముందుకు దూకి
విజయ మేడలు అధిరోహించాలి.
పందెంలో గెలవాలి,
నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి,
ధైర్యాన్ని దిక్సూచిగా చేసుకుని
విజయ తీరాలు చేరాలి.
జీవితంలో గెలవాలి,
పతనాల్లో పాఠాలు నేర్చుకుని,
విజయాల్లో వినయం నిలిపి
భవిస్యత్తును బంగారం చేసుకోవాలి. 🌈✨
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment