🌞రవిదేవుని రథయానం🌞
ఏడు గుర్రాల స్వర్ణ రథంపై
కాంతుల కిరీటంతో వెలిగే రవిదేవుడు —
అంధకారాన్ని చీల్చి
ఆశల ఉదయాన్ని మోసుకొచ్చే ప్రత్యక్షదైవం.
నదీ తీరాలపై నడిచే వెలుగు యాత్ర
పొలాల్లో పచ్చదనం,
మనసుల్లో ప్రశాంతత,
జీవితాల్లో నవచైతన్యం నింపే దివ్యదృశ్యం.
రధసప్తమి అంటే
సూర్యుడి రాక మాత్రమే కాదు —
మన లోపలి చీకట్ల నుంచి
వెలుగులోకి చేసే ఆత్మయానం.
రవిదేవుడి కాంతులు
మన ప్రతి అడుగుకూ ఆశీర్వాదం,
మన ప్రతి కలకూ నిజరూపం,
మన ప్రతి దినానికి మహాపర్వం.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.✍️

Comments
Post a Comment