ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
కలంపట్టి
కాగితాలమీద
ఎందుకో కమ్మనికవితలు ఎక్కించారు
ఎందరో మహానుభావులు
ఆలోచనలలో మునిగి
భావాలలో తేలి
ఎందుకో అంతరంగాన్ని ఆవిష్కరించారు
ఎందరో మహానుభావులు
అక్షరాలను యేరి
పదాలను పొసగి
ఎందుకో అత్యుత్తమకవనాలను అందించారు
ఎందరో మహానుభావులు
అందాలను వర్ణిస్తు
ఆనందాలను అందిస్తు
ఎందుకో అద్భుతకయితలను అల్లేశారు
ఎందరో మహానుభావులు
చూచి లేచి కదిలి
విని రాసి అనుభవించి
ఎందుకో అపరూపసుకవిత్వాన్ని కూర్చారు
ఎందరో మహానుభావులు
అమాయకంగానున్నవారిని
నిద్రావస్థలోనున్నవారిని
ఎందుకో తట్టిలేపి చక్కనిసాహిత్యాన్ని చదివిస్తున్నారు
మహానుభావులకు
వందనములు
వారిరచనలకు
ధన్యవాదములు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment