రాస్తూపోతా పోతూరాస్తా
రాశా రాస్తున్నా
రాస్తుంటా
రాస్తూరాస్తూ పోతా
పోతూపోతూ రాస్తా
ఆలోచనలు తడుతున్నంతవరకు
భావాలు పుడుతున్నంతవరకు
విషయాలు దొరుకుతున్నంతవరకు
రాస్తూనే పోతా
అక్షరాలు అందేవరకు
పదాలు పారేవరకు
కలము సాగేవరకు
రాస్తూరాస్తూ పోతా
కనుచూపు ఉన్నంతవరకు
శరీరశక్తి కలిగున్నంతవరకు
ప్రాణము నిలిచినంతవరకు
పోతూనే రాస్తా
అందాలు కనువిందుచేసేటంతవరకు
ఆనందాలు కలుగుతున్నంతవరకు
గుండె కొట్టుకునేటంతవరకు
పోతూపోతూ రాస్తా
కలలు కలుగుతున్నంతవరకు
కవిత కవ్వించేటంతవరకు
కల్పనలు తోచినంతవరకు
కలాన్ని పడుతూనేయుంటా
పూలు ప్రేరేపిస్తున్నంతవరకు
ప్రేయసి ప్రేమనుచూపిస్తున్నంతవరకు
ప్రకృతి పరవశింపజేస్తున్నంతవరకు
కవితలు వెలువరిస్తూనేయుంటా
కవులున్నంతవరకు
తెలుగు నిలుస్తుంది
తెలుగు సాగుతుంది
తెలుగు వెలుగుతుంది
తెలుగు బ్రతుకుతుంది
కవులు పుడతారు
కవితలు రాస్తారు
కవులు జీవిస్తారు
కవితలను జీవింపజేస్తారు
కవులకు
జేజేలు కొడదాం
కవితలకు
జేజేలు పలుకుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment