రామరాజ్యం రావాలి
రాముడు మరలాపుట్టాలి
రామరాజ్యం రావాలి
మనమంతా బాగుపడాలి
మానవలంతా కలసిజీవించాలి
రాక్షసరాజ్యాలు పోవాలి
రావణులంతా అంతరించాలి
రామలక్ష్మణులను పూజించాలి
రాజ్యాలన్ని సుభిక్షంగాయుండాలి
సీతారాములకళ్యాణం
ప్రతియేడూ జరగాలి
గ్రామగ్రామలందు
రామాలయాలువెలుగొందాలి
అందరు అన్నదమ్ములు
రామలక్షమణులులాగా ఉండాలి
అందరు దంపతులు
సీతారాములులాగా ఉండాలి
మంధరలను కనిపెట్టాలి
బహుదూరంగా పెట్టాలి
కైకేయిలను బహిష్కరించాలి
కాపురాలు కమ్మగాసాగాలి
ప్రజలమాటలను నేతలువినాలి
ప్రజాసంక్షేమమే పరమావధికావాలి
స్వార్ధాని అందరూ తగ్గించుకోవాలి
సమాజహితానికి అందరూ పాటుపడాలి
సేవకులంతా
హనుమంతునిలాగా ఉండాలి
యజమానుల యోగక్షేమాలు
నిరంతరం చూస్తుండాలి
జయజయరామా
పట్టాభిరామా
కోదండరామా
జైజై శ్రీరామా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment