నువ్వు నీపూలు
నువ్వు నాటిన
నీ పూలతీగ
పాకి పెరిగి
పల్లవించి పెద్దదయ్యింది
నువ్వు వేసిన
నీ పందిరికి
పూలతీగ ఎగబాకి
మొగ్గలుతొడిగింది
నువ్వు కోరినపూలను
నీ తీగపూచి
పరిమళాలను
వెదజల్లింది
నువ్వు ఇచ్చిన
నీ పువ్వును
తలలో తురుముకొని
తరుణి తృప్తిపడింది
నువ్వు అల్లినపూదండను
నీ ప్రేయసి పరమాత్ముని మెడలోవేసి
పవిత్రంగా పూజచేసి
పరవశించిపోయింది
నువ్వు తెలిపినప్రేమను
నీ పూలు
ప్రేయసికి చెప్పి
పులకరింపజేశాయి
నువ్వు పంపిన
నీ ప్రేమసందేశాన్ని
చెలిచెవిలో చెప్పి
సంతసపరచాయి
నీకు
నీ పూలకు
నీ ప్రేయసికి
అభివందనాలు
పూలకవితను
పూర్తిగా చదివిన
పాఠకులకు
ప్రత్యేక ధన్యవాదాలు
పూలబాషను నేర్చి
పూలబావాలు తెలుసుకొని
పూలమనసులు నెరిగి
పూలకవితలువ్రాసినకవులకు వందనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నువ్వు నీపూలును
నీ పూలపిచ్చియును
నీ పూలకవితలును
పాడుగాను
మంచి భావాలుకని
మంచి అందాలనుచూపి
మంచి ఆనందాలనిచ్చి
మంచి కవితలనువ్రాసి మనసులనుతట్టవయ్యాకవి
Comments
Post a Comment