నాపువ్వు
పువ్వును పిలిచా
ఉలకలా పలకలా
చెంతకు రమ్మన్నా
కదలలా మెదలలా
రంగులు చిందమన్నా
రగిలిపోతుంది
పరిమళాలు చల్లమన్నా
పెదవిబిగించింది
ముక్కుమీద
కోపంకనిపిస్తుంది
మూతిని
బిగించిపట్టియున్నది
వారంనుండి
విరులకవితను వ్రాయలేదని
అలిగింది
అలకపానుపు నెక్కింది
చక్కలిగిలిపెట్టా
నవ్వలా
సరసాలాడా
ప్రతిస్పందించలా
చెంపలేసుకున్నా
పట్టువదలలా
గుంజీలుతీశా
గమనించలా
కలంపట్టుకున్నా
కళ్ళుతిప్పిచూసింది
కవితనువ్రాశా
కనికరించింది
ముద్దులిచ్చింది
ముచ్చటలాడింది
మనసుపారేసుకుంది
మదినిదొచేచింది
నాకు పువ్వే తోడునీడా చెలిస్నేహితురాలు
నాకు పువ్వే అండదండ వెన్నుదన్ను
నాలో పువ్వే ఊహలుపుట్టించు
నాతో పువ్వే కవితలువ్రాయించు
రాసేవారిని
గెలిచేవారిని
గీసేవారిని
పైకెత్తండి పడేయకండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment