ఆసక్తికరంగా సాగిన 147వ అంతర్జాతీయ అంతర్జాల కాలిఫోర్నియా వీక్షణం సమావేశం నిన్న 16-11-2024వ తేదీ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారి 147వ వీక్షణం అంతర్జాల సమావేశం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు, కవి, గాయని శ్రీమతి గీతా మాధవి గారు ముఖ్య అతిధి, సహస్ర సినీటీవి గేయాల రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ ను మరియు హాజరయిన కవులకు స్వాగతం పలికారు. తర్వాత శ్రీ మౌనశ్రీ మల్లిక్ సినిమా గేయ రచయితలకు ఉండవలసిన లక్షణాలు మరియు పాటించవలసిన నియమాలను చక్కగా సోదాహరణంగా స్వీయానుభవాలతో వివరించారు. మౌనశ్రీ ప్రసంగం చాలా బాగున్నదని శ్రీమతి గీతా మాధవి, సినీ గేయ రచయిత శ్రీ సాదనాల వేంకటేశ్వరరావు, ప్రముఖ కవి శ్రీ రామాయణం ప్రసాదరావు మరియు వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ స్పందించి మౌనశ్రీ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు. పిమ్మట శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవిసమ్మేళనం నిర్వహించారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు కుండపోత అనే తన కవితను పాడి వినిపించారు.అవధానం అమృతవల్లి మనసంటే అనే పాటను,శ్రీ చేకూరి నరసింహారావుగారు ఒక దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. శ్రీవాకాటి రాంరెడ...
Popular posts from this blog
కవనం ఓకాల్కులేషన్ (రచనావ్యాసంగం) రచన ఒక గణనం కాదంటే అది అబద్ధం మననం మానసికవికారం కవనం ప్రణాళికాబద్ధం ఆలోచన పుట్టటం కవితకు కారణం ఊహలు ఉబుకటం ఉల్లానికి ఉత్ప్రేరకం ఎడమమెదడు సృజనాత్మకం కుడిమెదడు దృశ్యాత్మకం వ్రాయాలి పద్ధతిప్రకారం తెలపాలి తలలోనిభావం పాఠకులను మెప్పించటం కావాలి కైతలలక్ష్యం కాగితాలను నింపటం బాషను బ్రతికించటం అక్షరాలను అల్లటం కానేకాదు సులభం పదాలను పేర్చటం కాదుకాదు సరళం పంక్తులు విడగొట్టటం మదులకు ఎక్కించటం కవితా ప్రారంభం లేపాలి కుతూహలం కవితా సమాప్తం తెలపాలి ఉద్దేశం కవితారూపము మానసికప్రతిబింబం కవిమానసికశ్రమకు లభించేప్రతిఫలం కవితలివ్వాలి మనోవికాసం కవులునిలవాలి మదుల్లోకలకాలం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓ మంచిమిత్రమా! కళ్ళను మెరిపించు కర్ణాలను మెప్పించు మోమును నవ్వించు మదిని మురిపించు అందాలు చూపించు ఆనందాలు అందించు పూలను పూయించు పరిమళాలు వీయించు పలుకుల తేనెలచిందు పెదవుల అమృతంక్రోలించు వెన్నెల కురిపించు హాయిని కలిగించు ముందుకు నడిపించు శిఖరాలకు చేర్పించు దారులు చూపించు గమ్యాలను చేర్పించు ఆలోచనలు రేకెత్తించు అనుభూతులు పొందనివ్వు భావనలు పుట్టించు గుండెలను కదిలించు క్షేమము కాంక్షించు కూరిమిని కొనసాగించు సలహాలు ఇవ్వు సమస్యలు తీర్చు ప్రాణమిత్రులుగా నిలిచిపోదాం ప్రేమాభిమానాలతో పరిఢవిల్లుదాం స్నేహవిలువలు చాటుదాం చెలిమిబంధాలు సాగిద్దాం అందరికి ఆదర్శంగానిలుద్దాం కలసిమెలసి ప్రపంచాన్నిజయిద్దాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment