ఏమిటో ఈమాయ?
వసంతమాసం
రాగానే
పకృతి పులకరించి పరవశపరుస్తుంది
చిగురించేచెట్లను
చూడగానె
కళ్ళకు కమ్మదనం కలుగుతుంది
కోకిలస్వరం
వినగానె
మనసు మురిసిపోతుంది
మల్లెపూలను
చూడగానె
మదిలో కోర్కెలుపుడతాయి
నెమలినృత్యం
కనగానె
మనసు ముచ్చటపడుతుంది
చిలుకలను
చూడగానె
సోయగాలు మనసును తృప్తిపరుస్తాయి
పావురాలజంటను
కనగానె
మదిలో ప్రేమ పుట్టకొస్తుంది
నిండుజాబిల్లి
వెన్నెల చల్లగానె
మనసు ప్రియురాలు పొందుకావాలంటుంది
పూలతోటలోనికి
ప్రవేశించగానె
మది తోడుకావాలంటుంది
చెలి
చెంతకు చేరగానె
మనసు ఆనందముతో ఉప్పొంగిపోతుంది
కోరిక తీరెగా
కవిత పుట్టెగా
మనసు మురిసెగా
ఆనందమాయెగా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment