నా ప్రేమాయణం

(నేను నా ప్రేయసి)


ఆమె కనుపాపలలో

అందాల చిత్తరువులా

ప్రకాశిస్తున్నా

పరవశిస్తున్నా


ఆమె మోమును

చంద్రబింబంలా 

వెలిగిస్తున్నా

చక్కదనాలను చూస్తున్నా


ఆమె మనసులో

చెరగనిముద్రవేశా

ఆలోచనలు పుట్టించా

ఆశలు కలిగించా


ఆమె అధరాలలో

అమృతాన్ని దాచా

ఆస్వాదించాలనుకుంటున్నా

ఆరాటపడుతున్నా


ఆమె జడలో

పూలను తురిమా

అందాన్ని రెట్టింపుజేశా

ఆనందాన్ని పొందుతున్నా


ఆమె ఆలోచనలలో

అందగాడినయ్యా

అలజడిజేశా

ఆవేశపరచా


ఆమె రూపంలో

అందాలను మూటకట్టా

ఆనందాలను

అందుకుంటున్నా


ఆమె హృదయంలో

ప్రేమమూర్తిగా

ప్రజ్వరిల్లుతున్నా

పరితపించజేస్తున్నా


ఆమెను ఆటపాటలతో

అలరిస్తున్నా

ముద్దూముచ్చటలతో

మురిపిస్తున్నా


మమ్మలను

ఆశీర్వదించండి

ప్రోత్సహించండి

విడదీయకండి

వేదనకు గురిచేయకండి


మేము

అందాలకు

ప్రతిరూపాలము

ఆనందాలకు

ప్రతిబింబాలము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog