నారాణి
తలనిండ
పూలను దాల్చిన
పూబోడి
నారాణి
మోమునిండ
మొలకనవ్వులు కురిపిస్తున్న
ముద్దులాడి
నారాణి
మెడనిండ
నగలు ధరించిన
బంగరులక్ష్మి
నారాణి
వంటినిండ
పట్టుబట్టలుకట్టిన
వగలాడి
నారాణి
కంటినిండ
కాంతులిడుతున్న
కలికి
నారాణి
మేలిబంగారురంగులోన
మెరిసిపోతున్న
మహారాణి
నారాణి
చంద్రబింబమువలె
వెలిగిపోతున్న
చక్కని చిన్నది
నారాణి
అందచందాలతోడ
అలరిస్తున్న
అందాలరాశి
నారాణి
ఆనందాలతోడ
మురిసిపోతున్న
వెన్నెల దొరసాని
నారాణి
తలనువంచి
తాళిని కట్టించుకొనటానికి
తయారవుతున్న తరుణి
నారాణి
నారాణిని
చూడండి
నాకవితను
చదవండి
మాపెళ్ళికి
తప్పకరండి
మమ్మలను
దీవించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment