అతను ఎందుకో?
కలమును
కరమున పట్టాలంటాడు
కవితలను
కమ్మగా వ్రాయాలంటాడు
మనసులను
మురిపించాలంటాడు
మనుజులను
మయిమరిపించాలంటాడు
వ్రాతలతో
ఆకట్టుకోవాలంటాడు
మాటలలో
తేనెనుచల్లాలంటాడు
నక్షత్రాలమధ్య
నడవాలంటాడు
మేఘాలపల్లకిపైనెక్కి
తిరగాలంటాడు
పచ్చనిచెట్లపైకి
ఎక్కాలంటాడు
చల్లనిగాలిలో
ఎగరాలంటాడు
పూలతోటకు
వెళ్ళాలంటాడు
పూలతో
మాట్లాడాలంటాడు
చిరునవ్వులు
మోమున చిందిస్తానంటాడు
చిలుకపలుకులు
చక్కగా పలకుతానంటాడు
గళమెత్తి
శ్రావ్యంగా పాడాలంటాడు
చెయ్యెత్తి
బిగ్గరగా జైకొట్టాలంటాడు
పువ్వులను
చూడాలంటాడు
పరిమళాలను
పీల్చాలంటాడు
పున్నమి చంద్రుని
చూడాలంటాడు
చల్లని వెన్నెలలో
విహరించాలంటాడు
అందాలను
కాంచాలంటాడు
ఆనందాలను
పొందాలంటాడు
పూలబాటపై
నడవాలంటాడు
జీవితలక్ష్యాన్ని
చేరాలంటాడు
అతను చూచిన అందాలను
అందరి కళ్ళకు అందించి
ఆనందాలను పంచి ఆకర్షించి
అంతరంగాలను తట్టాలని ఆశపడుతున్నాడు
కవులను ప్రోత్సహిస్తే
కలకాలము బాషను
కంటికి రెప్పలా
కాపాడుతారని తెలుసుకోండి
అతనిని
తగినవిధంగా ప్రోత్సహించండి
అతనిని
జీవితగమ్యం చేరుకోనివ్వండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment